* అమరావతి: నేడు సాయంత్రం మంగళగిరిలో బీసీ సంకల్ప సభ.. అన్ని రాజకీయ పార్టీలు మంగళగిరి సీటును బీసీలకు కేటాయించాలని డిమాండ్
* నేడు హైదరాబాద్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్.. తన మేనల్లుడు రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్‌కు హాజరుకానున్న జగన్.. సాయంత్రం 6 గంటలకు తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు సీఎం.. రాత్రి 8 గంటలకు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌కు ఏపీ సీఎం.. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్
* తిరుమల: నేడు ఏప్రిల్ నెలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ
* అమరావతి: ఈ నెల 21వ తేదీన ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్న వైఎస్ షర్మిల.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్న ఏఐసీసీ, పీసీసీ ప్రముఖులు.
* ఏపీలో 38వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు..
* నేడు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు..
* నేడు టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం ఎన్టీఆర్ 28వ వర్ధంతి.. తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు
* ప్రకాశం జిల్లా: దర్శిలో వైసీపీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న నూతన ఇంచార్జీ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..
* బాపట్ల : చీరాల శ్రీ భద్రావతి అమ్మవారి సమేత శ్రీ భావనారుషి స్వామి వారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారి రదోత్సవ కార్యక్రమం..
* కాకినాడ: నేడు పిఠాపురం, శంకవరం మండలాల్లో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో పాల్గొనున్న కేంద్రమంత్రి మహేంద్ర మంజుపారా
* తిరుమల: ఇవాళ నుంచి ఆన్‌లైన్‌లో ఏప్రిల్ నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కి డిఫ్ విధానంలో పొందే ఆర్జిత సేవలకు నమోదు చేసుకునే అవకాశం
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలం లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని నర్తకి సెంటర్లో ప్రత్యేక కార్యక్రమాలు
* నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జిల సమావేశం
* ఏలూరు జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్న రాజ్యసభ సభ్యులు వివేక్ ఠాకూర్.. నేటి నుంచి నుంచి 20వ తేదీ వరకు “వికాసిత్ భారత్ సంకల్ప్ యాత్ర” కార్యక్రమంలో పాల్గొంటారు.
* ఏలూరులో సామాజిక సమతా సంకల్ప మహోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీ, ఈనెల 19వ తేదీన విజయవాడలో భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్బంగా బైక్ ర్యాలీ..
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఉదయం 10.00 గంటలకు ధవళేశ్వరంలోని మత్స్యకారులతో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆత్మీయ సమావేశం.. ముందుగా ధవళేశ్వరం బస్టాండ్ నుంచి జక్కంపూడి కళ్యాణ మండపం వరకు పాదయాత్ర.. అనంతరం మత్స్యకారులతో ఆత్మీయ సమావేశం.
* విశాఖ: GVMC ధర్నా చౌక్ దగ్గర “నిరవధిక రిలే నిరాహార దీక్ష” ప్రారంభించనున్న ఆర్టీసీ NMU యూనియన్.. విశాఖ జిల్లాలో యాజమాన్య ఏకపక్ష నిర్ణయాలకు, అపరిస్కృత సమస్యలపై జిల్లా కౌన్సిల్ తీర్మానం మేరకు దీక్షలు
* అనంతపురం : పెద్దవడుగూరు మండలం కొండూరు, వీరన్న పల్లి, నాగలాపురం, కొట్టాలపల్లి గ్రామాలలో యువ చైతన్య బస్సు యాత్ర చేపట్టనున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.
* అనంతపురం :సామాజిక సమతా సంకల్పంలో భాగంగా నేడు నగరంలోని టవర్ క్లాక్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మారథాన్ రన్
* అనంతపురం : పెద్దవడుగూరు మండల కేంద్రంలోని ఎస్సి కాలనీ లో పర్యటించనున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
* తిరుమల: 28 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,263 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,518 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు
* అమరావతి: నవరత్నాలు పేదలందరికి ఇళ్లు లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్ మెంట్.. ఇళ్ళ నిర్మాణానికి బ్యాంకులు 9 నుండి 11 శాతం వడ్డీతో రుణాలు.. మహిళల పై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తున్న ప్రభుత్వం .. ఇందులో భాగంగా 12.77 లక్షల మందికి 4,500.19 కోట్ల రూపాయలను బ్యాంకు రుణం అందించిన ప్రభుత్వం.. వీరిలో అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు ఇవాళ వడ్డీ రీఎంబర్స్ మెంట్.. 46.90 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో వర్చువల్ గా జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్.
* కర్నూలు: నేడు గూడూరు మండలం పొన్నకల్లులో శ్రీ హజరత్ మిన్నెల్లస్వామి(అయ్యకొండ) ఉరుసు సంధర్భంగా గంధం మహోత్సవం
* నంద్యాల: నేడు నందికొట్కూరు లో బీసీల రాజకీయ హక్కుల కోసం రథయాత్ర…
* కర్నూలు: మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో నేడు స్వామి వారి మూలబృందావనంకు తుంగ జలంతో అభిషేకం, తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతభిషకం వంటి విషేశ పూజలు. మధ్యాహ్నం స్వామి వారి మూలబృందావనంకు వివిధ రకాల పూలతో అలంకరణ. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లదరాయులకు ఉంజలసేవ, బంగారు పల్లకి, గజ వాహనం, నవరత్న స్వర్ణ రథంపై ఉరేగింపు.
