* నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన. రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటు. 503 ఎకరాల్లో విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించనున్న ప్రధాని.. లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్న మోడీ..
* నేడు ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్, గవర్నర్ అబ్ధుల్ నజీర్ .
* నేడు శ్రీసత్య సాయి జిల్లా పర్యటనకు సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి.. మధ్యాహ్నం 2.15కు గోరంట్ల మండలం పాల సముద్రం చేరుకోనున్న సీఎం జగన్.. మధ్యాహ్నం 3.10 గంటలకు ప్రధాని మోడీకి స్వాగతం పలుకనున్న సీఎం జగన్.. ప్రధాని, గవర్నర్ తో కలిసి నాసిన్ – నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్.. సాయంత్రం ఏడున్నరకు తిరిగి తాడేపల్లికి చేరుకోనున్న సీఎం జగన్
* దావోస్‌లో రెండో కొనసాగుతోన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు టీమ్ పర్యటన.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 54వ వార్షిక సమావేశంలో పాల్గొననున్న సీఎం టీమ్..
* ఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలపై నేడు బీజేపీ కీలక సమావేశం.. జేపీ నడ్డా అధ్యక్షతన హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల నేతలు.. తెలంగాణ నుంచి పాల్గొననున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు..
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు కనుమ పండుగ సందర్భంగా అంబాజీపేట మండలం జగన్నతోటలో ప్రభల ఉత్సవం.. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పే ప్రభల ఉత్సవానికి ప్రాధాన్యత.. ఈ ప్రభల తీర్థాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భారీగా తరలి రానున్న భక్తులు.. జగన్నతోటలో కొలువు కానున్న ఏకాదశ రుద్రులను దర్శించు కునేందుకు ఎడ్ల బండ్లపై రావడం ప్రత్యేకత.
* ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు..
* ఖమ్మం: నేడు మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
* ప్రకాశం : మర్రిపూడి మండలం గుండ్లసముద్రంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగే సర్వేపల్లి నియోజకవర్గ నేతల సమావేశంలో పాల్గొంటారు
* నెల్లూరులోని బోడి గాడి తోట ప్రాంతంలో పర్యటించనున్న మాజీ మంత్రి నారాయణ
* కనుమ సందర్భంగా నెల్లూరులోని పెన్నా కాలువలో శ్రీ సుందరేశ్వర స్వామివారికి తెప్పోత్సవం.
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో గోదాదేవి పరిణయోత్సవం.. మధ్యాహ్నం పార్వేట మండపం వద్ద పార్వేటి ఉత్సవం.. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
* తిరుమల: రేపు తిరుమల, తిరుపతిలో పర్యటించనున్న ఆర్కియాలజీ కమిటీ.. శిథిలావస్థలో వున్న అలిపిరి పాదాల మండపం, పుష్కరిణి అహ్నిక మండపాలను పరిశీలించనున్న కమిటీ సభ్యులు.. పునఃనిర్మాణానికి సంబంధించి టిటిడికి సూచనలు చేయనున్న ఆర్కియాలజి కమిటీ సభ్యులు
* నేడు హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. కాచిగూడ, నింబోలి అడ్డాలో జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో వాల్ రైటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు
* తూర్పుగోదావరి జిల్లా: నేటి సాయంత్రంతో ముగియనున్న కోడిపందాలు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా జోరుగా సాగిన పందాలు.. గోదావరి జిల్లాల్లో 250 బరుల్లో జరుగుతున్న కోడిపందాలు.. పందాల్లో 100 కోట్లు పైబడి చేతులు మారిన డబ్బు.. ఆఖరి రోజు మరింత జోరుగా సాగనున్న కోడిపందాలు.. ఐదు లక్షల రూపాయలు దాటి నిర్వహించే కోడిపందాలకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు
* అమరావతి: స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషనుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు..
* ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సమన్లు.. ఈ రోజు ఈడీ ముందు హాజరుకావాలని సోమవారం కవితకు నోటీసులు.. ఈడీకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత.. ఈ రోజు ఈడీ విచారణకు దూరంగా ఉండాలని కవిత నిర్ణయం
