Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేడు ముంబైలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు)ను ప్రారంభించనున్న ప్రధాని.. ముంబై-నవీ ముంబై మధ్య దాదాపు 2 గంటల నుంచి 20 నిమిషాలకు తగ్గనున్న ప్రయాణ సమయం.

* హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లకు నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు.. 18వ తేదీన తిరుగి తెరచుకోనున్న స్కూళ్లు.. జూనియర్ కాలేజీలకు ఈ నెల 13 నుంచి 16 వరకు సెలవులు

* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబుల పర్యటన.. న్యాల్కల్ లో నూతన చక్కెర కార్మగారానికి భూమి పూజ చేయనున్న మంత్రులు

* ప్రకాశం : ఒంగోలులో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..

* ఏపీలో 32వ రోజు కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు..

* తిరుమల: ఎల్లుండితో ముగియనున్న ధనుర్మాసం.. 15వ తేది నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పున:రుద్దరణ

* ప్రకాశం : కొండేపిలో మంత్రి ఆదిములపు సురేష్ ను నియోజకవర్గంలోని ఆరు మండలాల నాయకులతో పరిచయ కార్యక్రమం, హాజరుకానున్న ఎంపీ విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసుల రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, జంకే వెంకటరెడ్డి, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్ బాబూ, మాదాసి వెంకయ్య..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు: ఉదయగిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో వాటర్ ప్లాంట్ అను ప్రారంభించనున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి. అనంతరం ఉదయగిరిలో వైసీపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ

* నెల్లూరు రూరల్ పరిధిలోని ఆటో నగర్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

* గుంటూరు: నేడు గుంటూరులో పర్యటించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గుంటూరు- విశాఖ, నరసాపూర్ – హుబ్లీ రేణిగుంట- నంద్యాల ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

* గుంటూరు: నేడు వివేకానంద జయంతి సందర్భంగా బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో నమో రన్ కార్యక్రమం…

* పల్నాడు: సంక్రాంతి సంబరాలలో భాగంగా, నేటి నుంచి ఈ నెల 17 వరకు ఈపూరు మండలం ముప్పాళ్ళలో , రైతు మిత్ర జాతీయస్థాయి కబడ్డీ పోటీలు…

* గుంటూరు : సంక్రాంతి పండుగ సందర్భంగా రేపటినుండి ఈ నెల 17 వరకు గుంటూరు మిర్చి యార్డ్ కు సెలవులు… 17వ తేదీ నుండి యథావిథిగా జరగనున్న మిర్చి యార్డులో క్రయ విక్రయాలు.

* కాకినాడ: పిఠాపురంలో బల ప్రదర్శనకి సిద్ధమైన ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే.. నాలుగు మండలాల నుంచి కేడర్ వచ్చేలా ఏర్పాట్లు, ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే. పొలిటికల్ గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని ఆసక్తికర చర్చ

* కాకినాడ: నేటి నుంచి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ప్రజా దీవెన కార్యక్రమం.. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటిస్తానని చెప్తున్న ఎమ్మెల్యే.. ప్రత్తిపాడు కోఆర్డినేటర్ గా వరుపుల సుబ్బారావును ప్రకటించిన పార్టీ

* విశాఖ: నేడు గాజువాక హౌస్ కమిటీ ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ.. ముఖ్య అతిథులుగా రెవెన్యూ మంత్రి ధర్మాన, వైవీ సుబ్బారెడ్డి

* గుంటూరు: నేడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివిఐటి ఆధ్వర్యంలో, దర్గా టు దుర్గ పాదయాత్ర గుంటూరు దర్గా నుండి విజయవాడ దుర్గ గుడి వరకు 34 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్న విద్యార్థులు, తదితరులు….

* విశాఖ: బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆధ్వర్యంలో నేటి నుంచి మహా సంక్రాంతి సంబరాలు -2024 ప్రారంభం.

* అనంతపురం : నేటి నుంచి గుంతకల్ రైల్వే డివిజన్ లో హుబ్లీ- విజయవాడ మధ్య నడిచే అమరావతి ఎక్స్ప్రెస్ రైలును నర్సాపూర్ వరకు పొడిగింపు.

* శ్రీ సత్యసాయి : హిందూపురం నియోజకవర్గంలో ఐదవ రోజు ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన. చిలమత్తూరు మండలంలోని పంచాయతీల్లో జరిగే సమీక్షలో పాల్గొననున్న మంత్రి.

* అనంతపురం : అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను అణిచివేసే విధంగా ఎస్మా ప్రయోగించడాన్ని నిరసిస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం.

* పశ్చిమ గోదావరి: రేపటినుంచి వచ్చేనెల 9వ తేదీ వరకు భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు..

* ఏలూరు: చింతలపూడిలో సమావేశం కానున్న ఎమ్మెల్యే ఎలిజా వర్గం.. ఎలిజా సీటు కేటాయించకపోవడంతో అనుచరుల్లో అసంతృప్తి.. భవిష్యత్తు కార్యాచరణ పై అనుచరులతో కలసి చర్చించనున్న ఎమ్మెల్యే ఎలిజా

* తిరుమల: 15 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 53,055 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 15157 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.33 కోట్లు

Exit mobile version