Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* వైసీపీ మూడో జాబితాపై కొనసాగుతోన్న కసరత్తు.. విజయవాడ సెంట్రల్, పెనమలూరు పంచాయతీలపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం.. పలు నియోజకవర్గాల్లో ఇంఛార్జుల మార్పుపై సీఎంవోలో కొనసాగనున్న కీలక నేతల భేటీలు

* అమరావతి: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ కసరత్తు.. ఇవాళ పార్టీ పలు అనుబంధ విభాగాలు, బీసీ కార్పొరేషన్లతో సన్నాహక సమావేశం.. హాజరుకానున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనుబంధ విభాగాల, బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు.. ముఖ్య అతిధిగా హాజరుకానున్న సజ్జల

* ఏపీలో మూడో రోజు కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన.. ఎన్నికల సన్నద్ధత, చేసిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్.. ఈ ఉదయం 9.30 నిమిషాలకు ఈసీకి సీఈవో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఎన్నికల సన్నద్ధతకు తీసుకున్న చర్యలను వివరించనున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా.. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పలు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో ఈసీ సమావేశం.. సీఎస్, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీ హైలెవల్ మీటింగ్.. సాయంత్రం నాలుగున్నరకు పర్యటన వివరాలు, ఎన్నికల సన్నద్ధతపై ఈసీ మీడియా బ్రీఫింగ్

* అమరావతి: మున్సిపల్ కార్మికులను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం. ఈ రోజు 3 గంటలకు సచివాలయంలో మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు. గత రెండు వారాల నుంచి సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు.. దశలవారీగా జరిగిన చర్చలన్నీ విఫలం. యథావిథిగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె.

* ఏపీలో 30వ రోజు కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు..

* ఏపీలో మున్సిపల్ కార్యాలయాల వద్ద 16వ రోజు కొనసాగనున్న కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలు.

* ప్రకాశం : దర్శిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల పోటీలు, కార్యక్రమానికి హాజరుకానున్న పలువురు వైసీపీ ముఖ్య నేతలు..

* తిరుమల: ఇవాళ్టి నుంచి 25వ తేదీ వరకు సెలవులో టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. 25వ తేదీ వరకు జేఈవో వీరబ్రహ్మంకు ఈవోగా అదనపు భాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారి చేసిన సీఎస్‌ జవహర్ రెడ్డి

* బాపట్ల : ఈనెల 11న అద్దంకి జరగాల్సిన వైసీపీ సాధికార యాత్ర వాయిదా.. అద్దంకి వైసీపీలో కొత్త ఇంచార్జీ పానెం హనిమిరెడ్డి, పాత ఇంచార్జీ బాచిన కృష్ణ చైతన్య రెండు వర్గాలుగా విడిపోయిన వైసీపీ కార్యకర్తలు.. గత నాలుగైదు రోజులుగా నియోజకవర్గంలోని పలు వైసీపీ నేతలతో భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్న మాజీ ఇంచార్జీ కృష్ణ చైతన్య.. ఇరువర్గాలను సమన్వయ పరిచి కార్యక్రమాన్ని నిర్వహించే యోచనలో వైసీపీ అధిష్టానం..

* ప్రకాశం : రేపు ఒంగోలు పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, పలువురు ఏఐసీసీ ప్రతినిధులు.. అద్దంకి బస్టాండ్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించనున్న కాంగ్రెస్ శ్రేణులు..

* ఒంగోలులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గుంటూరు జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించనున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుండి రాజమండ్రి మీదుగా సంక్రాంతికి ఐదు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లు.. అటు విశాఖ, ఇటు విజయవాడ మీదుగా ఆయా ప్రాంతాలకు రైలు ప్రయాణికుల సౌకర్యార్థం ఐదు సంక్రాంతి ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లను నడువుతున్న దక్షిణ మధ్య రైల్వే.. విశాఖ – సికింద్రాబాద్, సికింద్రాబాద్- కాకినాడ, కాకినాడ-తిరుపతిల మధ్య ప్రత్యేక సంక్రాంతి రైళ్లు.. ఈ నెల 10,11, 12, 13, 16, 17 తేదీలలో ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్ల రాకపోకలు

* అంబేద్కర్ కోనసీమ: నేటి నుండి సంక్రాంతికి హైదరాబాద్ నుండి అమలాపురంకు 57 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు.. పండుగకు ఊరు వెళ్లే ప్రయాణీకుల కోసం ఈనెల 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ.. తిరుగు ప్రయాణంలో ఈనెల 16 నుండి అమలాపురం నుండి హైదరాబాద్ కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు.

* కాకినాడ: నేడు తుని నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన.. చామవారంలో జరగనున్న రా కదలిరా బహిరంగ సభలో పాల్గొనున్న చంద్రబాబు

* పల్నాడు నేడు నకరికల్లు మండలం గుండ్లపల్లి వద్ద ఇండో- ఇజ్రాయిల్ అగ్రికల్చర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన.. హాజరుకానున్న భారత్ ఇజ్రాయిల్ రాయబారి నార్ గిలోన్, మంత్రులు, కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు , నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు తదితరులు…

* పల్నాడు: నేడు లింగంగుంట్ల జడ్పీ హైస్కూల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం.. హాజరుకానున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.

* అనంతపురం : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్నికి వ్యతిరేకంగా మూడు రోజులపాటు ఆయిల్ ట్యాంకర్ల సరఫరా బంద్. గుత్తి బీబీసీఎల్ డిపో వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్న ఆయిల్ ట్యాంకర్ల యాజమానులు.

* శ్రీ సత్యసాయి : పెనుగొండ నియోజవర్గంలో వరుస సమావేశాలలో మంత్రి , సమన్వయకర్త ఉషశ్రీ బిజీబిజీ.. గోరంట్ల మండలం లో కార్యకర్తలతో నేడు సమీక్షా సమావేశం.

* శ్రీ సత్యసాయి : పంచాయితీల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… నేడు లేపాక్షి మండలంలో 12 పంచాయతీల్లో కార్యకర్తలతో సమావేశం కానున్న మంత్రి.

* శ్రీ సత్యసాయి: ఈనెల 22 న అయోధ్యకు రావాలంటూ.. సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ కు రామజన్మభూమి ట్రస్టు ఆహ్వానం.

* అనంతపురం : నేటి నుంచి ఆడుదాం ఆంధ్రా మండలస్థాయి క్రీడా పోటీలు.ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.

*పశ్చిమ గోదావరి: ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుండి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు జరిగే ఆడుదాం ఆంధ్ర ర్యాలీలో పాల్గొననున్న మంత్రి కొట్టు సత్యనారాయణ.. అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో తాడేపల్లిగూడెం పట్టణస్థాయి ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలను ప్రారంభిస్తారు.

* శ్రీ సత్యసాయి: హిందూపురం నియోజకవర్గంలో కొనసాగుతోన్న ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన.. వార్డుల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

* అనంతపురం : భారత చ్తెతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ సింహగర్జన సభ. హాజరు కానున్న పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ .

* శ్రీకాకుళం: నేడు మందస మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

* విజయనగరం జిల్లా: బొబ్బిలి టీడిపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన.. బొబ్బిలి పట్టణంలో గల రాజా కళాశాల మైదానంలో రా కదలిరా బహిరంగ సభలో పాల్గొనున్న చంద్రబాబు

Exit mobile version