* నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్.. నేటి నుంచి ఈ నెల 15 వరకు నామినేషన్ల స్వీకరణ
* హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ తమిళిసై..
* అమరావతి: నేడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే విచారణ.. నేడు స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉన్న నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ చీఫ్ విప్.. నేడు అనర్హత పిటిషన్లపై ఒకేసారి ఐదుగురి నుంచి వివరణ తీసుకోనున్న స్పీకర్
* అమరావతి: నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు.. ఉదయం 9 గంటలకు సమాశం కానున్న ఏపీ అసెంబ్లీ.. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ.. వివిధ శాఖల యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనున్న ప్రభుత్వం
* అమరావతి: నేడు అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు-2024, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు-2024 సభలో ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్
* విశాఖ: నేడు పెందుర్తి నియోజకవర్గ జనసేన సమీక్ష సమావేశం.. పాల్గొననున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు., రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు
* నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సిటీ నియోజకవర్గ నేతల సమావేశం..
* నెల్లూరు: కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ కు సంబంధించి పోర్టు సీఈవోతో సమావేశం కానున్న అఖిలపక్ష నేతలు
* నెల్లూరు సిటీ పరిధిలోని కపాడిపాలెంలో జనసేన నేతల ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమం
* విజయనగరం: బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ లో భాగంగా పిల్లలు మరియు మహిళలకు రక్షణ కల్పించే చట్టాలు, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా పరిరక్షణ చర్యలు బుర్రకథ, జముకుల బుర్రకథ మరియు వీధి నాటకాల ద్వారా 35 కార్యక్రమాలు.. నేటి నుంచి కార్యక్రమాలు ప్రారంభం
* శ్రీ సత్యసాయి: నేడు చిలమత్తూరు, లేపాక్షిలలో సొంత వ్యయంతో ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవం చేయనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ.. మున్సిపాలిటీ పరిధిలో 8 వార్డుల పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం.
* అనంతపురం: ఈనెల 22 నుంచి మూడు రోజుల పాటు జేఎన్టీయూలో మౌలికవసతులను పరిశీలించనున్న న్యాక్ కమిటీ.
* తూర్పుగోదావరి జిల్లా: రేపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కొవ్వూరు రాక.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్న షర్మిల
* ప్రకాశం : ఒంగోలు అంబేడ్కర్ భవన్ లో బాలల హక్కులపై ప్రాంతీయ సదస్సు, హాజరుకానున్న ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల ఐసీడీఎస్ అధికారులు..
* ప్రకాశం: కురిచేడులో రేపు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం..
* ఒంగోలు కలెక్టరేట్ ప్రాంగణంలో రేపు గుర్రం జాషువా విగ్రహావిష్కరణ కార్యక్రమం..
* విజయవాడ: రేపటి నుంచి 12వ తేదీ వరకు గుణదల మేరీ మాత ఉత్సవాలు.. ఇవాళ రాత్రి నుంచి ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..
* ఏలూరు: నేడు దెందులూరులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పర్యటన.. పోతునురులో బహిరంగ సభలో పాల్గొనున్న షర్మిల
* తిరుమల: 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,683 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,177 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు
* విజయవాడ: నేడు ఆశా వర్కర్ల ధర్నా, బెజవాడ ధర్నా చౌక్ లో ధర్నా చేయనున్న ఆశా వర్కర్లు
