* ఢిల్లీ: నేడు ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఉదయం 10 గంటలకు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్లమెంట్‌లో సమావేశం.. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
* విశాఖ: సాగర తీరంలో క్రికెట్ సంగ్రామం.. నేటి నుండి 5 రోజుల పాటు ఏసీఏ- విడిసిఏ స్టేడియంలో జరగనున్న ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్.. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్.. ఉదయం 8 గంటల నుండి స్టేడియంలోకి అనుమతించునున్న సిబ్బంది. రోజుకు 2500 మంది విద్యార్థులకు ఉచితంగా ఎంట్రీ.
* నేడు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్‌లో ఇంద్రవెల్లికి.. తెలంగాణ పునర్నిర్మాణ సభతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
* హైదరాబాద్: ఈ రోజు ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకోనున్న సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల గణేష్
* ప్రకాశం : కొండేపి, జరుగుమల్లిలలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిములపు సురేష్.. కురిచేడులో వైఎస్ఆర్ అసర కార్యక్రమంలో పాల్గొననున్న జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి వైసీపీ ఇంచార్జీ బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి..
* ప్రకాశం: పొదిలిలో టీడీపీ ఆధ్వర్యంలో బీసీ గర్జన కార్యక్రమం, ముఖ్యఅతిథిగా హాజరుకానున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.
* తిరుమల: రేపటి నుంచి మూడు రోజులు పాటు హిందు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్న టీటీడీ.. హాజరుకానున్న 57 మంది మఠాధిపతులు, పిఠాధిపతులు
* ప్రకాశం : ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అవతరణ దినోత్సవ వేడుకలు, హాజరుకానున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, కలెక్టర్ దినేష్ కుమార్..
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటన వివరాలు.. దుళ్ళ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం.. సవివాలయాలు-2,
రైతు భరోసా కేంద్రాలు-2, వెల్ నెస్ సెంటర్-1, ఎస్సీ పేటలో డ్రైన్ ప్రారంభం కార్యక్రమాల్లో పాల్గొంటారు.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి వై జంక్షన్ లోని ఆనం రోటరీ హాలులో రౌండ్ టేబుల్ సమావేశం.. చారిత్రాత్మిక నగరం రాజమండ్రిలో వారసత్వ సంపదలు, వీటి రక్షణ కొరకు తీసుకోవలసిన దీర్ఘకాలిక చర్యలపై చర్చించి భవిష్యత్తు తరాల కోసం మహోన్నత చరిత్రను, వారసత్వ సంపదలను పదిల పరుచుకోవడం కోసం చర్చ
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు రూరల్ పరిధిలోని జగ్జీవన్ రామ్ నగర్ లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
* నెల్లూరు: వెంకటగిరి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన
* మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. ద్వారకా తిరుమల మండలం ద్వారకా తిరుమల ఏఎంసీ మార్కెట్ యార్డు నందు నిర్వహించే మండల స్థాయి వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొంటారు. ఏలూరు దగ్గర నిర్వహించే సిద్ధం సభపై మీడియా సమావేశం.. నల్లజర్లలో జిల్లా పరిషత్ హైస్కూలు గ్రౌండ్ నందు నిర్వహించే మండల స్థాయి వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొంటారు.
* మంత్రి కొట్టుసత్యనారాయణ పర్యటన వివరాలు.. బలుసులమ్మ గుడి వద్ద మున్సిపల్ ప్రాంగణంలో టిడ్కో లబ్ధిదారులకు గృహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. తాడేపల్లిగూడెం లోని క్యాంపు కార్యాలయంలో దేవదాయ ధర్మదాయ శాఖ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.
* రేపు ఏలూరులో సిద్ధం సభ.. ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు.. సిద్ధం సభకు హాజరు కానున్న ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల నాయకులు, కార్యకర్తలు..
* శ్రీ సత్యసాయి : ముదిగుబ్బ మండలంలో వైసీపీ ఇంటింట ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.
* శ్రీ సత్యసాయి : చిలమత్తూరు , లేపాక్షి మండలాల్లో టీడీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సులు.
* ఏలూరు: ఈ నెల 8న జంగారెడ్డిగూడెం రానున్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల.. రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొనున్న షర్మిల
* తిరుమల: వరుసగా 23వ నెల వంద కోట్ల మార్క్ ని దాటిన శ్రీవారి హుండీ ఆదాయం.. జనవరి నెలలో శ్రీవారి హుండి ఆదాయం రూ.116 కోట్లు.. గత ఏడాది జనవరితో పోలిస్తే రూ. 7 కోట్లు తగ్గిన హుండీ ఆదాయం
* శ్రీ సత్యసాయి : సోమందేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి ఉషశ్రీ చరణ్ ఆత్మీయ పలకరింపు యాత్ర.
* శ్రీ సత్యసాయి : మడకశిర నియోజక వర్గంలో పర్యటించనున్న ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మండలాల వారీగా కార్యకర్తలతో సమన్వయకర్త లక్కప్పతో కలసి సమావేశం.
* తిరుపతి: జిల్లా వ్యాప్తంగా పలు నియోజక వర్గాల్లో టిడిపి ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సులు…
* తిరుమల: 9 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 57,223 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 18,015 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.44 కోట్లు
* నేడు ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఇంద్రవెల్లి లో పునర్నిర్మాణ సభలో పాల్గొననున్న నేతలు.. మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా కెస్లాపూర్ కు చేరుకోనున్న సీఎం.. 1.35 గంటలకు రోడ్డు మార్గాన వెళ్లి నాగోబా దర్శనం. 1.45 నుంచి 2.15 వరకు నాగోబా దేవస్థానం గోపురం, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం. 2.15 నుంచి 3.15 వరకు దర్బార్ హాల్ లో కార్యక్రమాలకు హాజరు. 3.15 నాగోబా నుంచి రోడ్డు మార్గాన ఇంద్రవెల్లి కి రానున్న సీఎం రేవంత్. 3.30 అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్న సీఎ. మధ్యాహ్నం 3.50 నుంచి 4.50 వరకు బహిరంగ సభ.. 4.55కు తిరుగుపయనం.
* గుంటూరు: ప్రత్యేక హోదా సాధన కమిటీ ఆధ్వర్యంలో నేడు గుంటూరులో ఏపీకి ప్రత్యేక హోదా , విభజన హామీలపై అవగాహన సదస్సు.. హాజరుకానున్న జేడీ లక్ష్మీనారాయణ
* గుంటూరు: ఇరవై అయిదు వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ వద్ద నిరసన…
* పల్నాడు: నేడు శావల్యాపురంలో టీడీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు..
* అనంతపురం : నేడు ఎస్కేయూనివర్శిటీ పాలకమండలి సమావేశం.
* శ్రీకాకుళం: శాసనసభాపతి తమ్మినేని సీతారాం నేటి కార్యక్రమాలు.. ఉదయం 10 గంటలకు బూర్జ మండలం కొరగాం పంచాయతీ పరిధిలోని బొరగవలస గ్రామాoలో మరియు తమ్మిన్నాయుడు పేట పంచాయతీ పరిధిలోని కటకమయ్యపేట మరియు తమ్మిన్నాయుడుపేట గ్రామాలలో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొళాయి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.. మధ్యాహ్నం 3 గంటలకు పొందూరు మండలం తొలాపి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.
