* హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష.. రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. పరీక్షలు రాయనున్న 9,80,978 మంది విద్యార్థులు.. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరణ.
* నేడు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. భీమవరంలో వైసీపీ నేత నాగేంద్రబాబు కుమారుడి వివాహానికి హాజరుకానున్న జగన్.. విశాఖలో డీసీసీబీ చైర్మన్ కుమారుడి వివాహానికి హాజరుకానున్న సీఎం జగన్
* హైదరాబాద్: నేడు సచివాలయంలో హెచ్‌ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై సమీక్షించనున్న రేవంత్‌రెడ్డి.
* నేడు సంగారెడ్డి జిల్లాలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన.. జహీరాబాద్ లో విజయ సంకల్ప యాత్రలో పాల్గొననున్న కిషన్ రెడ్డి
* ప.గో: నేడు తాడేపల్లిగూడెంలో టీడీపీ – జనసేన బహిరంగ సభ.. పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్
* నేడు విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స పర్యటన.. సెంచూరియన్ వర్సిటీలో రైతు సమ్మేళనంలో పాల్గొననున్న మంత్రి బొత్స.. దువ్వాంలో సచివాలయం భవనాలను ప్రారంభించనున్న బొత్స.. దేవాడలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్ర భవనాలను ప్రారంభించనున్న మంత్రి బొత్స..
* చిత్తూరు: నేడు సదుం, సోమల మండలాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
* తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,830.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,590
* బాపట్ల : అద్దంకి నియోజకవర్గం కొరిశపాడు మండలం పి. గుడిపాదు వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సిద్దం సభా వేదిక స్థలాన్ని పరిశీలించనున్న వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ ఎంపీ వై విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ఒంగోలులో ఎన్జీఓ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం : పొదిలిలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొననున్న మార్కాపురం వైసీపీ ఇంచార్జీ అన్నా రాంబాబు..
* ప్రకాశం: కొమరోలులో వైసీపీ నేతల ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్న ఇంచార్జి్ కేపీ నాగార్జున రెడ్డి..
* ప్రకాశం: దర్శిలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొననున్న జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి..
* విశాఖ: అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి జిల్లాల్లో “నిజం గెలవాలి” కార్యక్రమం.. చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించినున్న నారా భువనేశ్వరి
* కాకినాడ: రైల్వే గేట్ మరమ్మతుల నిమిత్తం నేటి నుంచి వచ్చే నెల 6 వరకు సామర్లకోట నార్త్ క్యాబిన్ రైల్వే గేటు మూసివేత.. ఫ్లై ఓవర్ మీదుగా రాక పోకలు డైవర్ట్ చేసిన రైల్వే అధికారులు
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు: మర్రిపాడు మండలంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
* నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఇంటింట ప్రచారం నిర్వహించనున్న టిడిపి అభ్యర్థి నారాయణ
* పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెం, ద్వారకాతిరుమల, భీమవరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ..
* శ్రీ సత్యసాయి : గోరంట్ల మండలంలో పార్టీ కార్యకర్తలతో పంచాయితీ స్థాయి సమావేశాలు నిర్వహించనున్న మంత్రి ఉషశ్రీ చరణ్.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటన వివరాలు.. ఉదయం 10 గంటలకు అంగన్ వాడీ టీచర్లు మరియు హెల్పర్లతో ఆత్మీయ సమావేశానికి హాజరు.. మధ్యాహ్నం 3 గంటలకు రూరల్ మండలం వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి హాజరు.. రాత్రి 7:30 గంటలకు అమలాపురం సబ్ కలెక్టర్ గారి వివాహ రిసెప్షన్ కు హాజరు.. రాత్రి 8 గంటల నుండి గుణ్ణం నాగబాబు గారి కుమారుడి వివాహంలో పాల్గొంటారు.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి మార్గాన్ని ఎస్టేట్ ప్రాంగణంలో మెగా ప్రాంతీయ జాబ్ మేళా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యా భివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి , పశ్చిమ , కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాల లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మెగా ప్రాంతీయ జాబ్ మేళ” నిర్వహణ.. పాల్గొననున్న 150 కంపెనీలు..
* గుంటూరు: నేడు గుంటూరు ఉమెన్స్ కాలేజీలో, స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా…
* గుంటూరు: నేడు గుంటూరు మిర్చి యార్డులో దిగుమతులకు బ్రేక్, మిర్చి టిక్కీలు అధికంగా రావడం, మిర్చి యార్డులో వాహనాలు రద్దీతో మరోసారి ఒక రోజు పాటు దిగుమతులకు విరామం ప్రకటించిన మిర్చి యార్డు పాలకవర్గం.
* నంద్యాల: నేడు శ్రీశైల ఆలయంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు
