Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఢిల్లీ: నేటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ సమావేశాలు.. బీజేపీ ఒంటరిగా 370 స్థానాలు గెలిచేలా వ్యూహరచన.. ఎన్డీఏతో కలిసి 400 స్థానాలు గెలిచేందుకు ప్లాన్.

* నేడు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ

* నేడు శ్రీశైలంలో రెండో రోజు మహాకుంభాభిషేకం.. ఉదయం గోపూజ, జపాలు, గణపతి, రుద్ర, చండీ వేదపారాయణాలు, హోమాలు, సాయంత్రం క్షీరాధివాసం, వేదస్వస్తి, నీరాజనం, మంత్రపుష్పం.. శ్రీ స్వామి అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు..

* ఇవాళ తిరుమలలో సర్వదర్శన టోకెన్ల జారీ రద్దు చేసిన టీటీడీ.. రేపటి నుంచి మే నెల సర్వదర్శన టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ..

* బాపట్ల : ఇంకొల్లులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా.. కదలిరా బహిరంగ సభ.. చంద్రబాబు మధ్యాహ్నం 2.30 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2.55 గంటలకు ఇంకొల్లు చేరుకుంటారు. 3.15 నుంచి 4.45 గంటల వరకు సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 5.10 గంటలకు ఇంకొల్లు నుంచి హెలికాప్టర్లో ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలం జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు నగరంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్యోగ.. ఉపాధ్యాయ . కార్మిక.. పెన్షనర్ల ధర్నా

* నెల్లూరు: ఆత్మకూరు.. అనంతసాగరం మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి

* ప్రకాశం : ఒంగోలులో 20న సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించనున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..

* ప్రకాశం: మార్కాపురంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏపీఎన్జీవో హోం వద్ద అన్ని ఉద్యోగ సంఘాలు ర్యాలీ, ధర్నా..

* నెల్లూరు జిల్లా: నేడు నింగిలోకి G.S.L.V. F-14 రాకెట్ ప్రయోగం.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో కొనసాగుతున్న ప్రక్రియ.. రాకెట్ ప్రయోగానికి నిన్న మధ్యాహ్నం మొదలైన కౌంట్ డౌన్.. 27 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం ఈ రోజు సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు రాకెట్ ను ప్రయోగించనున్న శాస్త్రవేత్తలు

* విజయనగరం: నేడు శృంగవరపుకోట ‌నియోకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శంఖారావం సభ..

* అనంతపురం : రేపు రాప్తాడులో పర్యటించనున్న సీఎం వైఎస్‌ జగన్. వ్తెఎస్సార్ సీపీ ఎన్నికల శంఖారావ సిద్ధం సభలో పాల్గొననున్న జగన్. సిద్ధం సభ నేపథ్యంలో కట్టుదిట్టమ్తెన భద్రత ఏర్పాట్లు.

* తిరుమల: 24వ తేదీన పౌర్ణమి గరుడ వాహన సేవ

* అనంతపురం : బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో నేటి నుంచి కొండమీద రాయుడి బ్రహ్మోత్సవాలు. 24న బ్రహ్మరథోత్సవం.

* ఏలూరు: మంత్రి తానేటి వనిత నేటి పర్యటన షెడ్యూల్.. మధ్యాహ్నం 12 గంటలకు దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు కాకినాడలో కుసుమ సత్య కన్వెన్షన్ లో జరిగే ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు.

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటన వివరాలు.. కాతేరు గ్రామంలో.. స్వచ్ఛత-మన భాద్యత.. శానిటేషన్ పై ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం.. ఉదయం 7:30 గంటలకు కాతేరు పాత పంచాయతీ కార్యలయం దగ్గర నుండి ప్రారంభం.. అనంతరం 11 గంటలకు .హుకుంపేట డి- బ్లాక్ వాంబే కాలనీ వద్ద..జగనన్న పేదలందరికి ఇళ్లు‌ పధకంలో ‌భాగంగా టిడ్కో గృహాలు లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం

* అంబేద్కర్ కోనసీమ జిల్లా : సీపీఎస్‌ ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఈనెల 18వ తేదీన తలపెట్టిన ఓట్ ఫర్ ఓపీఎస్ కార్యక్రమానికి అనుమతులు లేవు : జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్

* తిరుపతి: రుయా ఆసుపత్రి వద్ద కొనసాగుతూన్న జూనియర్ డాక్టర్ల నిరసన.. పెండింగులో ఉన్న ఆరు నెలలు స్టైఫండ్ మంజూరు చేయాలని డిమాండ్

* విశాఖ: మిలన్ 2024కు సిద్ధం అయిన విశాఖ.. ఇవాళ్టి నుంచి మూడు రోజులు ప్రాక్టీస్ పరేడ్.. RK బీచ్ రోడ్‌లో అమలులోకి ట్రాఫిక్ ఆంక్షలు.. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 గంటల వరకూ సాధారణ ప్రజల రాకపోకలు నిషేధం

* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,483 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,276 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3 కోట్లు

* నేడు భీమిలి,పెందుర్తిలో నారా లోకేష్ శంఖారావం సభలు

* పల్నాడు : నేడు నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో గడప_గడపకు_మన_ప్రభుత్వం కార్యక్రమానికి హాజరు కానున్న నరసరవుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ ….

* నేడు విజయవాడ కార్పొరేషన్, మచిలీపట్నం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాలు

Exit mobile version