* రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ.. నేడు జైపూర్‌లో నామినేషన్ వేయనున్న సోనియా.. ప్రస్తుతం రాయ్‌బరేలి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సోనియా గాంధీ.. వచ్చే ఎన్నికల్లో రాయ్‌బరేలి నుంచి ప్రియాంక పోటీ
* తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు.. ఏపీ, తెలంగాణలోని సరస్వతీ ఆలయాల్లో అక్షరాభ్యాసాలు.. బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు
* తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,840.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600.. కిలో వెండి ధర రూ.77,000
* నేటి నుంచి మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు.. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవింరాజు కోసం రేపు ఉదయం వరకు మండమెలిగే పండుగ ఉత్సవాలు.. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో వేడుకలు
* హైదరాబాద: నేడు ఇరిగేషన్‌పై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం
* హైదరాబాద్: నేడు తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్‌పై హైకోర్టు తీర్పు.. ప్రొ.కోదండరామ్, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారంపై రానున్న క్లారిటీ
* నిర్మల్: బాసరలో వసంత పంచమి వేడుకలు.. ఉదయం 3 గంటల నుంచే అక్షర శ్రీకార పూజలు ప్రారంభం
* హైదరాబాద్: ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న స్థలంలో భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం శంకుస్థాపన.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు
* పల్నాడు : నేడు చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గంలో పల్నాడు వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పర్యటన.. చిలకలూరిపేట వద్ద అనిల్ కు ఘన స్వాగతం పలకనున్న, వైసీపీ నాయకులు, శ్రేణులు.. నరసరావుపేట నియోజకవర్గంలో భారీ ర్యాలీ.. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్న అనిల్ కుమార్ యాదవ్.
* కాకినాడ: నేటి నుంచి కాకినాడ పార్లమెంట్ పరిధిలో ప్రచారం ప్రారంభించనున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్.. అభ్యర్థిగా ప్రకటన తర్వాత తొలిసారి కాకినాడ వస్తున్న సునీల్
* ప్రకాశం : సింగరాయకొండలో కొండేపి నియోజకవర్గం లోని అన్నీ మండలాల వాలంటీర్లతో మంత్రి ఆదిములపు సురేష్ సమావేశం..
* ప్రకాశం: సంతనూతలపాడు వైసీపీ నేతలతో మంత్రి మేరుగ నాగార్జున సమావేశం, హాజరుకానున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ఒంగోలులో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..
* ప్రకాశం: దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం, హాజరుకానున్న మంత్రులు ఆదిములపు సురేష్, మేరుగ నాగార్జున, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* బాపట్ల : మార్టూరు మండలం బొల్లాపల్లిలో నూతనంగా నిర్మించిన సచివాలయం భవనం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న వైసీపీ ఇంచార్జ్ ఆమంచి కృష్ణమోహన్..
* కాకినాడ: నేను అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం.. 2024 -2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆమోదించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్న పాలకమండలి
* ప్రకాశం : ఒంగోలులో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్న కలెక్టర్ దినేష్ కుమార్..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్.. తోటపల్లి గూడూరు.. ముత్తుకూరు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు రూరల్ మండలంలోని అల్లిపురంలో టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయనున్న రాష్ట్ర పురపాలక పఠనాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పర్యటన వివరాలు. అమలాపురం పాత బస్ స్టేషన్ స్థానంలో నూతనంగా ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి ఉదయం 9:30 గంటలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చేతుల మీదగా శంకుస్థాపన.. అనంతరం అమలాపురంలలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొననున్న మంత్రి విశ్వరూప్
* విజయనగరం: నేడు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం..
* విజయనగరం: ఎస్వీఎన్ నగర్ లో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయంలో నేడు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం..
* తిరుమల: ఎల్లుండి శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. ఈ సందర్భంగా రేపటి నుంచి 17వ తేది వరకు సర్వదర్శనం భక్తులుకు జారీ చేసే టోకేన్లు రద్దు చేసిన టీటీడీ.. నేరుగా వైకుంఠం క్యూ కాంప్లేక్స్ చేరుకునే భక్తులును సర్వదర్శనానికి అనుమతించనున్న టీటీడీ
* అనంతపురం : పెద్దపప్పూరు మండలంలోని పలు గ్రామాలలో టిడిపి యువ చైతన్య బస్సు యాత్ర.
* అనంతపురం : గుత్తి మండలం సేవాఘడ్ లో సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంత్యుత్సవాలు.
* పశ్చిమ గోదావరి: మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన వివరాలు.. ఉదయం విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ జలకళ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో వద్ద నిర్మించిన భవన నిర్మాణ కార్మిక సంఘం ముఖద్వారం (ఆర్చి)ని ప్రారంభిస్తారు.
* శ్రీ సత్యసాయి : హిందూపురం పట్టణంలోని మేళాపురంలో 27 అడుగుల ఆంజనేయస్వామి ఏకశిల విగ్రహానికి నేడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం.
* అనంతపురం : ఈనెల 16న రాయలసీమ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. హాజరు కానున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్
* శ్రీ సత్యసాయి : నిజం గెలవాలి పర్యటన లో భాగంగా నేడు పెనుకొండలో పర్యటించనున్న నారా భువనేశ్వరి. దర్గా పేటకు లో మృతి చెందిన రహీం కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి.
* విజయనగరం జిల్లా: పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాలలో నేడు నారా లోకేష్ శంఖారావం సభలు..
