NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690.. కిలో వెండి ధర రూ.77,100

* నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడిగడ్డ పర్యటన.. ఉదయం 10.15కి అసెంబ్లీ నుండి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సులో మేడిగడ్డకు.. మధ్యాహ్నం మేడిగడ్డ బ్రిడ్జ్‌, కుంగిన పిల్లర్ల పరిశీలన

* నేడు నల్గొండలో బీఆర్ఎస్‌ బహిరంగ సభ.. హాజరుకానున్న కేసీఆర్‌

* నేడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వరంగల్‌ పర్యటన.. వెయ్యిస్తంభాల గుడి, వరంగల్‌ కోటను సందర్శించనున్న కిషన్‌రెడ్డి

* ప్రకాశం : ఒంగోలులో నగరంలో అన్నీ డివిజన్ల వైసీపీ అధ్యక్షులతో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం..

* ప్రకాశం: ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్ లో వామపక్ష పార్టీల సమావేశం..

* ప్రకాశం: దర్శి మండలం శివరాజ్ నగర్ లో వైసీపీ ఇంచార్జీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమం..

* ప్రకాశం: పెద్దారవీడులో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి తాటిపర్తి చంద్రశేఖర్..

* ప్రకాశం : జిల్లా వైసీపీలో తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం.. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్న మాగుంట..

* నెల్లూరు జిల్లా: వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగే సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.. అనంతరం టీపీ గూడూరు మండలంలో జరిగే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.

* నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం

* నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో వివిధ పార్టీల బీ.సీలకు అధిక స్థానాలు కేటాయించాలని కోరుతూ నెల్లూరులో బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

* నెల్లూరు: మర్రిపాడులో విజయీభవ యాత్రను చేపట్టనున్న ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

* నెల్లూరు: కోవూరులో వైసిపి ఆధ్వర్యంలో ఆత్మీయ సదస్సు… పాల్గొననున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి

* ఏలూరు: నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం .. 2024-25 బడ్జెట్, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పై సమీక్ష..

* విశాఖ: నేడు సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.. ఆడుదాం – ఆంధ్రా ఫైనల్స్ లో గెలిచిన విజేతలకు ట్రోఫీ అదజేయనున్న సీఎం.. PM పాలెం క్రికెట్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేసిన ACA

* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా ఇంచార్జ్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ పర్యటన.. కడియం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు. శంకుస్థాపనలు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు హైకోర్టులో ‘జనసేన’కు గాజుగ్లాసు గుర్తు కేటాయించడంపై అభ్యంతరం తెలియజేస్తూ రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ వేసిన రిట్ పిటిషన్ పై విచారణ

* తూర్పుగోదావరి జిల్లా: నేడు ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన క్వారీ గోతులను పూడ్చాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి క్వారీ సెంటర్లో నిరసన దీక్ష.. క్వారీ యజమానుల, అధికారుల తీరుకు నిరసనగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష

* అనంతపురం : పెద్దపప్పూరు మండలంలో యువ చైతన్య బస్సు యాత్ర చేపట్టనున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.

* అనంతపురం : గుత్తి మండలంలోని సేవాఘడ్ లో నేటి నుంచి సంత్ సేవాలాల్ జయంత్యుత్సవాలు.

* అనంతపురం : నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో బాలోత్సవం కార్యక్రమం.

* శ్రీ సత్యసాయి : జిల్లాలో నేటి నుంచి నిజం గెలవాలి కార్యక్రమం.. పాల్గొననున్న నారా భువనేశ్వరి.. పుట్టపర్తి రూరల్ మండలం, నిడుమామిడి గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ. గాజుకుంటపల్లి గ్రామం, ఓబుళదేవచెరువు మండలంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ. కదిరి నియోజకవర్గం, కదిరి టౌన్, 8వ వార్డులో కార్యకర్త కుటుంబానికి పరామర్శ. తనకల్లు మండలం, కొర్తికోట గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ. ముష్టిపల్లి గ్రామం, కదిరి రూరల్ మండలంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ. తలపుల మండలం, తలపుల గ్రామంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి.

* అనంతపురం : బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ సింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ర్యాలీ, సభ.

* తిరుమల: 20 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,314 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,165 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.5.48 కోట్లు

* అనంతపురం : శింగనమల వైసిపి సమన్వయకర్త వీరాంజనేయులును వ్యతిరేకిస్తూ కార్యాచరణ కోసం అసమ్మతి మండల నాయకులు సమావేశం. ఓ మండల నాయకుడి తోటలో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.