Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఢిల్లీ: నేడు పార్లమెంట్‌కు హాజరుకావాలని పార్టీ ఎంపీలకు విప్‌ జారీ చేసిన బీజేపీ

* హైదరాబాద్‌: నేడు ఉదయం 9 గంటలకు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. బడ్జెట్‌ను ఆమోదించనున్న కేబినెట్‌

* హైదరాబాద్‌: నేడు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బడ్జెట్‌.. శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు

* నేటి నుంచి జగిత్యాల జిల్లాలో బండి సంజయ్‌ ప్రజాహిత యాత్ర.. ఇవాళ ఉదయం కొండగట్టులో బండి సంజయ్‌ ప్రత్యేక పూజలు.. మొదటి రోజు మేడిపల్లి నుంచి కథలాపూర్‌ మండలం సిరికొండ వరకు ప్రజాహిత యాత్ర

* నేడు హైదరాబాద్‌లో ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ సదస్సు.. కేంద్రం తెచ్చిన విద్యుత్‌ సవరణ చట్టం-2022 బిల్లుపై నిరసన.. దేశవ్యాప్తంగా హాజరుకానున్న విద్యుత్‌ ఇంజనీర్లు, ఉద్యోగులు

* అనంతపురం: ఇవాళ జేఎన్టీయూలో యువ న్యాయవాదుల సదస్సు.. హాజరుకానున్న సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు

* తిరుమల: 4 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,593 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 18,517 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.31 కోట్లు

* రేపు కాకినాడ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు.. రేపు సాయంత్రం 5.30 గంటలకు కాకినాడలో బయలుదేరి మంగళవారం ఉదయం 10.30కి అయోధ్య చేరుకోనున్న రైలు.. ఈ నెల 14న తిరిగి కాకినాడకు రైలు

* తిరుమల: 18వ తేదీ నుంచి మే నెలకి సంబంధించిన దర్శన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ

* ప్రకాశం : చీమకుర్తి మండలంలోని నాయుడుపాలెం, బండ్లమూడి పల్లామల్లి, తొర్రగుడిపాడులలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి మేరుగ నాగార్జున..

* ప్రకాశం: సింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పాకల నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న మంత్రి ఆదిములపు సురేష్..

* నెల్లూరు : గుడ్లూరు మండలం రామాయపట్నం వద్ద కర్లపాలెం గ్రామస్తుల భూ నిర్వాసితులు సమస్య పరిష్కరించాలంటూ 6వ రోజు ధర్నా

* బాపట్ల : చీరాల మండలం ఈపురుపాలెంలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కరణం బలరాం..

* అనకాపల్లి జిల్లాలో నేడు పీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల పర్యటన.. నాతవరం(మం) ములగపూడిలో రచ్చ బండ కార్యక్రమం నిర్వహించనున్న షర్మిల

* నేటి సాయంత్రం విశాఖకు నారా లోకేష్.. రేపు ఇచ్ఛాపురం నుంచి ఉత్తరాంధ్ర శంఖారావం …

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలం జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని కోరుతూ జనసేన ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం

* నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ నేతల సమావేశం

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాష్ట్రమండ్రిలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటన.. కడియం మండలం మురమండలో చేనేత కార్మికులకు మగ్గాలు, రాట్నాలు పంపిణీ చేయనున్న మంత్రి

* విజయనగరం: నేడు జిల్లాలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ పర్యటన.. చీపురుప‌ల్లి చేరుకుని గ్రామ పంచాయ‌తీలో చేప‌ట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ్య ప‌నుల‌పై స‌మీక్ష నిర్వహిస్తారు. రావివ‌ల‌స చేరుకొని గ్రామ స‌చివాల‌య భ‌వ‌నాన్ని ప్రారంభిస్తారు. తెట్టంగి చేరుకొని రైతుభ‌రోసా కేంద్రం, గ్రామ స‌చివాల‌యం, వెల్ నెస్ సెంట‌ర్ భ‌వ‌నాల‌ను ప్రారంభిస్తారు.

* శ్రీ సత్యసాయి : పెనుకొండ , సొమందేపల్లి మండల స్థాయి నేతలు, కార్యకర్తలు , వాలంటీర్లతో మంత్రి ఉషశ్రీ చరణ్ సమావేశం.

* అనంతపురం : గుంతకల్లు రైల్వే జంక్షన్ సమీపంలోని తిమ్మంచర్ల రైల్వే స్టేషన్ లో జైపూర్ నుంచి మైసూర్ వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు సిగ్నల్ దాటుకుని వెళ్లడంతో, పైలట్ లోకో పైలెట్ ను సస్పెండ్ చేసిన రైల్వే అధికారులు.

* విశాఖ: నేడు VMRDA చిల్డ్రన్ ఎరీనాలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సమ్మిట్ -2024.. ముఖ్యఅతిథిగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్

* కాకినాడ: రత్నగిరిపై రేపటి నుంచి మాఘమాసం కావడంతో పెళ్లిళ్ళ సందడి.. ఏప్రిల్ 26 వరకు వివాహా ముహూర్తాలు.. 30 శుభ ముహూర్తాలు ఉన్నాయని తెలిపిన అర్చకులు, కొండపై ఇప్పటికే అడ్వాన్స్ రిజర్వేషన్లు

* పల్నాడు: నేటి నుండి రెండు రోజులపాటు కొండవీడు కోట ఉత్సవాలు.. కొండవీడు ఫెస్ట్ 24 పేరుతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉత్సవాలను ప్రారంభించనున్న మంత్రులు విడదల రజిని, రోజా, కారుమూరి నాగేశ్వరరావు , అంబటి రాంబాబు తదితరులు…

* పశ్చిమ గోదావరి: నేడు నర్సాపురం ఎటిగట్టు పనులను పరిశీలించనున్న ముగ్గురు చీఫ్ ఇంజనీర్ల బృందం.. ఏటిగట్టు పటిష్ట పరిచేందుకు నిర్మిస్తున్న గట్టు గోదావరిలోకి కుంగిపోవడంతో ఆందోళనలో స్థానికులు..

* అనంతపురం : గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో ఈనెల 11 నుంచి గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు. ఈనెల 24 న రథోత్సవం.

* ఆదిలాబాద్: నాగోబా మహపూజ పూర్తి.. జాతర ప్రారంభం. పవిత్ర గంగాజలం తో నాగోబా కు అభిషేకం. భక్తుల దర్శనానికి అనుమతి.. నాగోబా ను దర్శించుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటిడిఏ పీవో కుష్బూ గుప్త, ఎస్పీ గౌస్ ఆలం. ఎమ్మెల్యే లు వెడ్మ బొజ్జు, అనీల్ జాదవ్

* జోగులాంబ గద్వాల జిల్లా: అలంపూర్ ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో నేటి నుండి ప్రారంభమై 14వ తేదీ వరకు జరగనున్న జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. బ్రహ్మోత్సవాలు చివరి రోజు బుధవారం 14 వ తేదీ నాడు సహస్ర కళాశాలతో అభిషేకంతో పాటు భక్తులకు నిజరూప దర్శనం ఇవ్వనున్న జోగులాంబ అమ్మవారు..

Exit mobile version