NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నెల్లూరు జిల్లా: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం.. నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక, కలెక్టరేట్‌లో 1077, 0861 2331261 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచన, జిల్లాలోని అధికారులు, ఉద్యోగులకు సెలవులు రద్దు

* ప్రకాశం : మిచౌంగ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. తీర ప్రాంత అధికారులతో కలెక్టర్ దినేష్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్.. మత్స్యకారులను వేటకు వెళ్ల వద్దని ఆదేశాలు జారీ, ఉద్యోగులకు సెలవులు రద్దు.. ఇవాళ్టి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచనలు.. కలెక్టరేట్ లో 1077 కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు..

* తూర్పుగోదావరి జిల్లా: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా, తుఫానుగా మారే అవకాశం.. డిసెంబర్ 4 నుండి 6 వరకు జిల్లాలలో వర్షపాతం నమోదు హెచ్చరికలు.. మండల పరిధిలోని తహశీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ అనుబంధ అధికారులు మండల ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలి.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక.. కలెక్టరేట్, డివిజన్, మండల పరిధిలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు.. కలెక్టరేట్, రాజమండ్రి 8977935609, ఆర్డీవో రాజమండ్రి 0883-2442344, ఆర్డీవో కొవ్వూరు 08813231488 – కలెక్టర్ కే. మాధవీలత

* ప్రకాశం : యర్రగొండపాలెం మండలం గోల్లవిడిపిలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..

* ప్రకాశం : ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు పర్యటన, మార్కాపురం, యర్రగొండపాలెం, దోర్నాల ప్రాంతాల పరిశీలన..

* తిరుమల: రేపు తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవం.. పార్వేటి మండపం వద్ద మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్న అర్చకులు

* ప్రకాశం : జిల్లా వ్యాప్తంగా ఓట్ల నమోదుకు రెండు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్.. జిల్లాలోని 2,183 పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండనున్న బీఎల్ఓలు.. కొత్త ఓట్ల నమోదు, సవరణలకు అవకాశం..

* అనంతపురం : గుంతకల్లు పట్టణంలో పర్యటించనున్న జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి.

* శ్రీ సత్యసాయి : హిందూపురంలో గుడ్డం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణ. స్వామివారి కల్యాణోత్సవం

* శ్రీ సత్యసాయి : పరిగి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నేడు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక తనిఖీపై ప్రజావేదిక.

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.. నేటి నుంచి రెండు రోజులు పాటు జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం

* నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో పట్టి నేతలతో సమావేశం కానున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్

* నెల్లూరులోని కలెక్టరేట్ లో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న ఎన్నికల ప్రత్యేక అధికారి భాస్కర్

* కాకినాడ జిల్లా: 215వ రోజుకు చేరిన నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర.. ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2944.6 కిలోమీటర్లు.. ఉదయం 8 గంటలకు కాకినాడ రూరల్ తిమ్మాపురం యార్లగడ్డ గార్డెన్స్ నుంచి పాదయాత్ర ప్రారంభం. పవర జంక్షన్ వద్ద పాదయాత్ర పెద్దాపురం నియోజకవర్గంలోకి ప్రవేశం.. చిత్రాడ వద్ద పాదయాత్ర పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం. యండపల్లి జంక్షన్ వద్ద విడిది కేంద్రంలో బస.

* పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ..

* అనంతపురం : కళ్యాణదుర్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్.

* అనంతపురం : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓటు వేసే విధానం ప్తె విస్త్రత అవగాహన చేపట్టిన అధికారులు.. నేటి నుంచి నియోజకవర్గ కేంద్రాలలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు.

* శ్రీ సత్యసాయి : కొత్తచెరువు మండలంలోని ర్తెల్వే సొరంగం మరమ్మత్తులకు ర్తెల్వే అధికారుల సన్నాహాలు. పుట్టపర్తి మార్గంలో ఈనెల 8 నుంచి ర్తెళ్ల రాకపోకలు బంద్ .

* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు జిల్లాలో ఆహార కమిషన్ సభ్యుడు బి కాంతారావు పర్యటన.. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అన్నదానిపై క్షేత్ర స్థాయిలో పరిశీలన..

* తూర్పుగోదావరి జిల్లా: రేపు కార్తీక సోమవారం సందరర్భంగా రాజమండ్రిలో కోటి దీపాల పండుగ, రాజమండ్రి నగరంలోని 20 గోదావరి స్నాన ఘాట్ల వెంబడి దీపోత్సవం కార్యక్రమం.. 12 గంటల పాటు నిర్విరామంగా 126 మందితో నృత్య ప్రదర్శన.. వివిధ రంగాలలో ప్రముఖులకు సప్పాఎక్స్ లెన్స్ 2023 పురస్కారాలు ప్రదానం. జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్,శ్రీ జ్ఞాన సరస్వతి పీఠము , గౌతమి ఘాట్ ఆధ్యాత్మిక సంస్థల సమైక్య ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం..

* శ్రీకాకుళం: ఆమదాలవలసలో నేడు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పర్యటన.. ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొననున్న స్పీకర్

* విజయనగరం జిల్లాలో ఈ రోజు, రేపు ఓటరు నమోదు కార్యక్రమం స్పెషల్ క్యాంపెయిన్‌ రోజులుగా నిర్వహించబడును.. భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండల తహసీల్దార్‌ల ప్రకటన.. అందరూ బీపీఎల్‌వోలు తమ తమ పోలింగ్ స్టేషన్ లలో తప్పకుండా విధులు నిర్వహించాలి.. ఓటరు నమోదు, ఓటరు లిస్ట్ మార్పులు మరియు చేర్పులు చేసుకొనుటకు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించు కావాలని విజ్ఞప్తి

Show comments