* అమరావతి: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1లో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన భేటీ.. మిచౌంగ్ తుఫాన్, పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలు, పెన్షన్ పెంపు సహా పలు కీలక అంశాలపై చర్చించనున్న కేబినెట్
* హైదరాబాద్: నేడు ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. మధ్యాహ్నం 3 గంటలకు ఆస్పత్రి నుంచి నంది నగర్‌లోని తన పాత నివాసానికి వెళ్లనున్న కేసీఆర్
* హైదరాబాద్: సచివాలయంలో ఈ రోజు ఉదయం 9.30 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించనున్న తుమ్మల నాగేశ్వరరావు
* విజయవాడ: నేటితో ముగియనున్న ఏపీ కాంగ్రెస్ కమిటీ సమావేశాలు.. రానున్న ఎన్నికల్లో సన్నద్ధత పై మూడు రోజులుగా జరుగుతున్న సమావేశాలు
* నేడు సంగారెడ్డి జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ పర్యటన.. పటాన్‌చెరులో ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొననున్న బాలకృష్ణ
* నేడు టీడీపీలో చేరనున్న తాడికొండ ఎమ్మెల్యే (వైసీపీ) ఉండవల్లి శ్రీదేవి.. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోన్న శ్రీదేవి.
* విజయవాడ: నేడు యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్వర్యంలో DEO కార్యాలయం దగ్గర ధర్నా.. బదిలీలు, ప్రమోషన్లు, పెండింగ్ బిల్లులు తదితర సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్
* ప్రకాశం : ఒంగోలులో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్న కలెక్టర్ దినేష్ కుమార్..
* ఒంగోలు కలెక్టరేట్ ఎదుట సమస్యలు పరిష్కరించాలంటూ రెండవ రోజు ఆశా వర్కర్ల 36 గంటల ధర్నా..
* బాపట్ల : చీరాల మండలం ఈపురుపాలెం హనుమాన్ నగర్ లో 63 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం..
* తిరుమల: ఎల్లుండి నుంచి ధనుర్మాసం ప్రారంభం.. ఎల్లుండి నుంచి జనవరి 14వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ బదులుగా తిరుప్పావై నిర్వహణ
* ప్రకాశం : దోర్నాలలో ప్రత్యేక స్పందన కార్యక్రమం, హాజరుకానున్న కలెక్టర్ దినేష్ కుమార్, మంత్రి ఆదిమూలపు సురేష్..
* నెల్లూరు: డైకాస్ రోడ్ లో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
* అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరులోని ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించనున్న అధికారులు.. ప్రజాప్రతినిధులు
* విజయనగరం: నేడు జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందితో ఆరోజు పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాలని పేర్కొన్నారు.
* విజయనగరం: కలెక్టర్ కార్యాలయం సమీపంలోని పించనుదారు సామాజిక భవన్ లో నేడు అఖిల భారత పించనదారుల దినోత్సవం సభ..
* శ్రీ సత్యసాయి : ధర్మవరం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తిరుకళ్యాణ మహోత్సవం.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు అపరిస్కృతంగా ఉన్న డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశ వర్కర్ల ధర్నా
* తూర్పుగోదావరి జిల్లా: నేడు డిమాండ్ల సాధన కోసం రాజమండ్రి ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ వర్కర్స్ ధర్నా
* అనంతపురం : తాడిపత్రి లోని బస్టాండ్ సమీపంలో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేయనున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
*గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరికి అన్యాయం జరిగిందంటూ నేడు హిందూ కాలేజీ సమీపంలో ఆర్యవైశ్య సంఘాల నిరసన ప్రదర్శన..
* పల్నాడు : సాతులూరు- నరసరావుపేట స్టేషన్ల మధ్య 11 క్రాసింగ్ రైల్వే లైన్లకు అత్యవసర మరమ్మతులు… ఎల్లుండి వరకు రైలు గేటును మూసివేయనున్న అధికారులు..
* పల్నాడు: సీఎం జగన్ జన్మదిన సందర్భంగా ఈనెల 21న సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైసీపీ అధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం….
* గుంటూరు: రేపటి నుండి గుంటూరు బీఆర్ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ పోటీలు..
* బాపట్ల: నేడు రేపల్లె మండలం వడ్డీవారిపాలెంలో మహానటి సావిత్రి జయంతి ఉత్సవాలలో పాల్గొననున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు…
* తూర్పు గోదావరి జిల్లా: రేపు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా మండల, నియోజక వర్గ స్థాయి లో మెగా, మిని ఉద్యోగ మేళాలు.. రాజమండ్రి కలెక్టరేట్ లో జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరణ
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రిలో ఘనంగా జరుగుతున్న ముక్కోటి శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు.. ఈ అధ్యయనోత్సవాలలో భాగంగా నేడు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నందు వరాహవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న భద్రాద్రి రాముడు
* కర్నూలు: నేడు ఆలూరులో టిడిపిఇంచార్జి కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో టిడిపి విస్తృత స్థాయి సమావేశం…
