* హైదరాబాద్: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఉదయం 11.30కి అసెంబ్లీలో కేబినెట్ భేటీ.. గవర్నర్ ప్రసంగంపై కేబినెట్‌లో చర్చించనున్న మంత్రులు
* ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, ముందుగా శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం.. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక
* హైదరబాద్: నేడు సచివాలయంలో భాద్యతలు స్వీకరించనున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమాక్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,
* నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్
* విశాఖ: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం… తొలిపూజ చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీధర్. నెల రోజులపాటు ఆలయంలో ప్రత్యేక పూజలు.. తెలుగు రాష్ట్రాల నుంచి రానున్న భక్త్తులు..
* ప్రకాశం : యర్రగొండపాలెంలో సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొననున్న మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, గుంటూరు జిల్లా జెడ్పీ చైర్మన్ హెనీ క్రిస్టినా..
* ప్రకాశం : అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ మూడో రోజు జిల్లా వ్యాప్తంగా కొనసాగనున్న నిరసన కార్యక్రమాలు..
* ప్రకాశం : రేపు దోర్నాలలో ప్రత్యేక స్పందన కార్యక్రమం, హాజరుకానున్న కలెక్టర్ దినేష్ కుమార్, మంత్రి ఆదిమూలపు సురేష్..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరులోని శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారి ఆలయంలో అధ్యయన ఉత్సవాలు
* విశాఖ: నేడు సీఎం ట్రాన్సిట్ హాల్ట్.. ఉద్ధానం పర్యటనకు వెళ్తూ కొద్దిసేపు ఎయిర్‌పోర్ట్‌లో ఆగనున్న ముఖ్యమంత్రి జగన్..
* పశ్చిమ గోదావరి: మంత్రి కొట్టు సత్యనారాయణ అమరావతిలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నానికి తాడేపల్లిగూడెం చేరుకుంటారు.. తిరిగి రాత్రికి తాడేపల్లిగూడెం నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్తారు.
* విజయనగరం: నేడు బొబ్బిలి మండలంలోని కాశిందొరవలస పంచాయతీ డొంగురువలసలో ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు పర్యటన..
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి సమావేశం.. రాజమండ్రి ఆనంద రీజన్సీ పందిరి హాలులో జరుగనున్న సమావేశం
* శ్రీ సత్యసాయి : బుక్కపట్నం మండలం సిద్ధరాంపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనన్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
* అనంతపురం : జిల్లాలో కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా.
* విశాఖ: నేటి నుంచి ఆశావర్కర్లు మహాధర్నా.. GVMC గాంధీచౌక్ దగ్గర 36 గంటల జరనున్న నిరసన
* విజయనగరం: నగరంలోని పాత సిటీబస్టాండ్ ఆవరణలో ఉన్న కనకమహాలక్ష్మి ఆలయంలో నేటి నుంచి మార్గశిర మాసోత్సవాలు.. నెల రోజుల పాటు ప్రతి రోజూ అమ్మవారికి పంచామృతాభిషేకాలు, ఫలాభిషే కాలు, కుంకుమార్చన నిర్వహించనున్నారు.. సాయంత్రం సహస్ర నామార్చన
* కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో నేడు స్వామి వారి మూలబృందావనంకు తుంగ జలంతో అభిషేకం, తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతభిషకం వంటి విషేశ పూజలు. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లదరాయులకు ఉంజలసేవ, నవరత్న స్వర్ణ రథంపై ఉరేగింపు.
* కర్నూలు: నేడు నంద్యాల జిల్లాలో కేంద్ర బృందం పర్యటన.. కరువు పరిస్థితులను అంచనా వేయనున్న కేంద్ర బృందం
* అనంతపురం : కళ్యాణదుర్గంలో కార్యకర్తలతో సమావేశం కానున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* నేడు తిరుపతి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన.. జిల్లాలోని ఐదు మండలాల్లో కరువు పరిస్థితులను అంచనా వేయనున్న కేంద్ర బృందం..
