* ఏలూరు: నేడు దెందులూరు మండలం గాలాయిగూడెం గ్రామంలో నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన.. వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో పాల్గొనున్న గవర్నర్..
* నేడు వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర.. 1. చోడవరం – అనకాపల్లి జిల్లా, 2. రాజం పేట -అన్నమయ్య జిల్లాలో కొనసాగనున్న యాత్ర..
* అనకాపల్లి జిల్లా: నేడు చోడవరం నియోజకవర్గంలో సామజిక సాధికార బస్సు యాత్ర.. ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో రోలుగుంట నుంచి వడ్డాది వరకు బైక్ ర్యాలీ, బహిరంగ సభ.. పాల్గొననున్న వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు
* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.. జిల్లా కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్న మంత్రి పొన్నం
* నేడు సంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో జరిగే BRS కృతజ్ఞత సభల్లో పాల్గొననున్న హరీష్ రావు
* ఉమ్మడి మెదక్ జిల్లాపై చలి పంజా.. రోజురోజుకు పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు, సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు, సిద్దిపేట జిల్లా కొండపాకలో 12 , మెదక్ జిల్లా రామాయంపేటలో 12.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
* ఖమ్మం: నేడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కొనమునేని సాంబ శివరావు కు ఖమ్మంలో విజయోత్సవ సభ.. ర్యాలీ
* ఒంగోలులో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా నగరంలో పలు చోట్ల సేవా కార్యక్రమాలు, హాజరుకానున్న మంత్రులు ఆడిమూలపు సురేష్ , మేరుగ నాగార్జున, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, పలువురు ముఖ్య నేతలు..
* ప్రకాశం : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో వారం రోజుల పాటు భద్రతా వారోత్సవాలు..
* పశ్చిమగోదావరి జిల్లా: ఈ నెల 19న భీమవరానికి సీఎం జగన్.. విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ నేతల సమావేశం
* అనంతపురం : శెట్టూరు మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల వాలంటీర్లతో మంత్రి ఉషాశ్రీచరణ్ సమావేశం
* అనంతపురం : కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో జిల్లా అధికారులతో సమావేశం కానున్న కేంద్ర కరువు బృందం సభ్యులు.. మధ్యాహ్నం నుంచి క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన.
* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు కొత్తపేట మండలంలో పంట నష్టం పరిశీలనకు టీడీపీ నిజ నిర్ధారణ బృందం.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటల నష్టాన్ని పరిశీలించనున్న తెలుగుదేశం పార్టీ నిర్ధారణ బృందం .. రాజమండ్రి శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు లతో కూడిన బృందం పర్యటన
* అనంతపురం : గుంతకల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కార్తిక వనభోజన కార్యక్రమం పాల్గొననున్న ఎమ్మెల్యే వైవీఆర్.
* అనంతపురం : శింగనమలలో మండలస్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమం.హాజరు కానున్న కలెక్టర్ గౌతమి.
* కర్నూలు: నేడు మద్దికేరలో షష్టి ఉత్సవాల సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ, అభిషేకాలు , మంగళ హారతి తులసి అర్చన, ప్రత్యేక పూజలు.
* నంద్యాల: జగజ్జనని ఆలయంలో నేడు అమావాస్య పూజలు లక్ష దీపోత్సవం
* మహానంది క్షేత్రంలో నేడు రుద్రాభిషేకం, లక్ష కుంకుమార్చన, స్వామివారికి అమ్మవారికి శాంతి కళ్యాణం
* కాకినాడ: తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని నేటి నుంచి అంగన్ వాడి ఉద్యోగులు సమ్మె, మూతపడనున్న అంగన్‌వాడీ కేంద్రాలు, రాష్ట్ర, జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపు
* విజయనగరం: కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలోని పత్రికా సమాచార బ్యూరో(పి.ఐ.బి) కి అదనపు డైరెక్టర్ జనరల్ డా. ధీరజ్ కకాడియా జిల్లాలో పర్యటన. వికసిత్ భారత్ సంకల్ప యాత్రను క్షేత్రస్థాయిలో పరిశీలన..
* విశాఖ: నేడు అనంతపద్మనాభ స్వామి దీపోత్సవం.. పద్మనాభం (మం) కొండపై జరిగే దీపోత్సవానికి వేలాదిగా రానున్న భక్తులు.. విస్త్రతమైన భద్రత ఏర్పాట్లు…
* విజయనగరం: పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాల ముగింపులో భాగంగా నేడు మహాన్నదాన కార్యక్రమం..
* హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి చీఫ్ ఆఫీసర్ గా గుమ్మి చక్రవర్తి నియామకం.. నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా ఉన్న చక్రవర్తిని సీఎం చీఫ్ ఆఫీసర్ గా నియమిస్తూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు
* విజయనగరం: సతివాడ విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సతివాడ కల్లాలు, మధుపాడ, పినతరిమి, పెదతరిమి, బోడ్డపేట, బొప్పడాం, బుచ్చన్నపేట, వల్లూరు గ్రామాల్లో విద్యుత్తు ఉండదని అధికారుల ప్రకటన..
