NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* అమరావతి: నేడు వైఎస్సార్ లా నేస్తం.. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమం.. 2023-24 సంవత్సరానికి రేపు రెండో విడత 2,807 మందికి సహాయం.. లబ్ధిదారుల ఖాతాల్లో దాదాపు రూ.8 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్.

* హైదరాబాద్‌: ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి.. నేటి నుంచి పునః ప్రారంభం.. ఉదయం 10:30 గంటలకు అన్ని కలెక్టరేట్లలోని సమావేశ మందిరంలో నిర్వహణ

* నేడు సిద్దిపేట జిల్లాలో బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్న మంత్రి పొన్నం

* చిత్తూరు: నేడు రొంపిచర్ల మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి పెద్దిరెడ్డి.

* నేడు ఒంగోలు మల్లయ్య లింగం భవన్ లో వామపక్ష పార్టీల సమావేశం..

* ప్రకాశం : ఒంగోలులో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి..

* కాకినాడ: అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తుల రద్దీ.. ఆఖరి కార్తీక సోమవారం కావడంతో కిట కిట లాడుతున్న రత్నగిరి.. తెల్లవారుజామున నుంచి ప్రారంభమైన వ్రతాలు, దర్శనాలు

* తిరుమల: 23వ తేది నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం.. పది రోజులు పాటు భక్తులుకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్న టీటీడీ.. 22వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులకు టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ.. రోజుకి 42500 చోప్పున పది రోజులుకు 4.25 లక్షల టోకెన్లు విడుదల చేయనున్న అధికారులు. టోకెన్ల జారికి తిరుపతిలో 10 ప్రాంతాలలో 94 కౌంటర్లు ఏర్పాటు చెయ్యనున్న టీటీడీ

* కాకినాడ: నేడు 219వ రోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. జిల్లాలో నేటితో ముగియనున్న పాదయాత్ర.. తుని నుంచి ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేటలోకి ప్రవేశించనున్న పాదయాత్ర

* అనకాపల్లి జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న లోకేష్ యువగళం పాదయాత్ర.. సాయంత్రం పాయకరావుపేట నియోజకవర్గంలోకి యువగళం.. పాల్గొననున్న ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నాయకత్వం..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. వెంకటాచలం లో జరిగే అసైన్మెంట్ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు

* నెల్లూరు: వింజమూరులో వైసిపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి

* విశాఖ: నేడు జనసేన ఆధ్వర్యంలో మహాధర్నా.. నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఉదయం 10 గంటలకు మహాధర్నాకు పిలుపు ఇచ్చిన జనసేన.. వీఐపీ రోడ్డులో మూసివేసిన టైకూన్ జంక్షన్ తెరవాలని డిమాండ్..

* అనంతపురం : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐటియూసీ ఆధ్వర్యంలో ధర్నా.

* కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో పంచరామ క్షేత్రంలో ఒకటైన చంద్రుడు ప్రతిష్ట చేసిన భీమవరం సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము రెండు గంటల నుండి బారులు తీరారు. శివనామ స్మరణతో మార్మోగుతోన్న ఆలయం పరిసర ప్రాంతాలు,

* ప.గో: పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక శోభ.. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయం.. ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అర్చకులు, దీపాలు వెలిగించి పూజలు చేస్తున్న భక్తులు

* పశ్చిమగోదావరి జిల్లా: కార్తీక 4వ ఆఖరి సోమవారం కావడంతో అమరేశ్వర ఘాట్, వలందరరేవులో కార్తీకమాసం స్నానాలు చేసేందుకు పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడుతున్న అమరేశ్వర, కపిల మల్లేశ్వరస్వామి, బసవేశ్వర స్వామి, శ్రీ దుర్గా లక్ష్మనేశ్వర స్వామి ఆలయాలు

* విజయనగరం: పోలిపల్లి గ్రామం, భోగాపురం మండలం, నెల్లిమర్ల నియోజకవర్గం, భూమాత లే అవుట్ వద్ద లోకేష్ పాదయాత్ర ముగింపు సభ ప్రాంగణం కోసం నేడు భూమి పూజా కార్యక్రమం.. హాజరుకానున్న ఉతరాంధ్ర జిల్లాల ముఖ్య నాయకులు..

* తూర్పుగోదావరి జిల్లా: కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో భక్తులతో పులకరించిపోతున్న గోదావరి నది తీరం, భక్తుల కార్తీక స్నానాలతో కిటకిటలాడుతున్న రాజమండ్రిలో స్నానఘట్టాలు.. వేలాదిగా విచ్చేసి స్నానాలు ఆచరిస్తున్నన భక్తులు

* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి కలెక్టరేట్ లో యథావిధిగా జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం

* విశాఖ: నేడు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం.. 18 అజెండా, 27 సప్లిమెంటరీ అంశాలపై చర్చ.

* గుంటూరు: నేడు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం..

* గుంటూరు : నేడు తెనాలిలో ఐ టీ కళాశాలలో జాబ్ మేళా …

* గుంటూరు : నేడు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అగ్రిగోల్డ్ బాధితుల సత్యాగ్రహ దీక్ష…

* నేడు శ్రీశైలం కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణిలో లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి

* నంద్యాల : శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు.. కార్తీకమాస చివరి సోమవారం కావడంతో ముక్కంటి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్తులు.. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్న భక్తులు.. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనం.. దర్శనానికి సుమారు 5 గంటల సమయం

* అనంతపురం : శివకోటిలోని శ్రీపీఠంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు.

* నంద్యాల: కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా నేడు మహానంది క్షేత్రంలో స్వామివారికి మహా రుద్రాభిషేకం, సాయంత్రం లక్ష బిల్వార్చన