Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ముంబై: నేడు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ కీలక సమావేశం.. టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ఎంపికపై చర్చ

* ఐపీఎల్‌ 2024: నేడు లక్నోతో తలపడనున్న ముంబై.. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌

* నేడు మెదక్‌ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన.. అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద సభకు హాజరుకానున్న మోడీ.. సాయంత్రం 4.30 గంటలకు సభలో ప్రసంగించనున్న ప్రధాని మోడీ

* నేడు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ సెక్రటరీ

* నేడు కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన.. మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్ జనజాతర సభకు హాజరుకానున్న సీఎం. సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొననున్న సీఎం. రాత్రి 7 గంటలకు బాలాపూర్ అండ్‌ బడంగ్‌పేట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి, రాత్రి 9 గంటలకు ఆర్కేపురం మరియు సరూర్‌నగర్ కార్నర్ మీటింగ్‌కు హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

* నేడు ఉదయం 10 గంటలకు టంగుటూరులో సీఎం జగన్‌ ప్రచార సభ.. మధ్యాహ్నం 12.30కి మైదుకూరు 4 రోడ్ల జంక్షన్‌లో జగన్‌ సభ.. మ. 3 గంటలకు కలికిరిలో ఎన్నికల ప్రచార సభ..

* అమరావతి: నేడు టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల.. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల చేయనున్న నేతలు

* నేడు ఖమ్మం, మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన.. డీసీసీ సమావేశంలో పాల్గొననున్న భట్టి, తుమ్మల, పొంగులేటి, రేణుకాచౌదరి

* ప్రకాశం : ఇవాళ జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. కొండేపి నియోజకవర్గం టంగుటూరులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్.. ఉదయం 11 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న జగన్..

* ప్రకాశం: ఇవాళ జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సినీ నటుడు, టీడీపీ ముఖ్యనేత బాలకృష్ణ పర్యటన.. ఒంగోలులో తొలిసారి ఓటు హక్కు పొందిన యువకులతో సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక సదస్సులో పాల్గొననున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్.. మర్రిపూడి, సంతనూతలపాడులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న సినీ నటుడు, టీడీపీ ముఖ్య నేత బాలకృష్ణ..

* ప్రకాశం : కొత్తపట్నం మండలం ఈరముక్కలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..

* ప్రకాశం: తాళ్ళూరు మండలం లక్కవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న వైసిపి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..

* కడప : నేడు జిల్లాకు ముఖ్యమంత్రి రాక.. మైదుకూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు

* నెల్లూరు: జలదంకి మండలంలోని వివిధ గ్రామాల్లో విజయ సంకల్పయాత్ర నిర్వహించనున్న ఉదయగిరి వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి

* నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న టిడిపి అభ్యర్థి పొంగూరు నారాయణ

* నెల్లూరు: కావలి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న నెల్లూరు వైసిపి లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి

* నెల్లూరు: చేజర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న నెల్లూరు టిడిపి లోక్ సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

* నెల్లూరు: ముత్తుకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సర్వేపల్లి టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి

* నెల్లూరు: జలదంకి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఉదయగిరి టిడిపి అభ్యర్థి సురేష్

* అన్నమయ్య: నేడు పీలేరు నియోజకవర్గం కలికిరిలో సిఎం జగన్ ఎన్నికల ప్రచార సభ.. రోడ్ షో.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సొంత గ్రామంలో జగన్ సభ

* ఏలూరు: నేడు దెందులూరు లో చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు ఉండవల్లి నుంచి దెందులూరు చేరుకొనున్న చంద్రబాబు.. దెందులూరు ఎన్టీఆర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొనున్న చంద్రబాబు.. సభానంతరం తెనాలి వెళ్లనున్న చంద్రబాబు.

* నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. తెనాలి మార్కెట్ సెంటర్ లో ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు.., జనసేన కూటమి అభ్యర్థి, నాదెండ్ల మనోహర్ తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్న చంద్రబాబు.

* తిరుమల: 4 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,673 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 30,607 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.1 కోట్లు

Exit mobile version