Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* ఐపీఎల్‌: నేడు కోల్‌కతా వర్సెస్‌ గుజరాత్.. కోల్‌కతా వేదికగా మధ్యాహ్నం 3.30కి మ్యాచ్‌ ప్రారంభం

* ఐపీఎల్‌: నేడు ఢిల్లీ వర్సెస్‌ హైదరాబాద్‌.. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

* నేడు గుజరాత్‌ హైకోర్టులో రాహుల్‌ పరువునష్టం కేసు విచారణ..

* తిరుమల: నేటి నుంచి శ్రీవారి సాలకట్ల పద్మావతి పరిణయోత్సవాలు.. గజవాహనంపై నారణగిరి ఉద్యానవనానికి చేరుకోనున్న శ్రీవారు

* వరంగల్‌: నేడు శ్రీభద్రకాళి-భద్రేశ్వరుల రథోత్సవం..

* పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జిల్లా ఇంఛార్జి మంత్రి దాడిశెట్టి రాజా పర్యటన.. కలెక్టరేట్‌లో డి.ఆర్.సి సమావేశానికి హాజరుకానున్న మంత్రి..

* తిరుపతి: నేడు ఎస్వీ యూనివర్సిటీ పాలక మండలి సమావేశం

* తిరుమల: ఇవాళ శ్రీవారిని దర్శించుకోనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. అనంతరం తిరిగి విజయవాడకు ప్రత్యేక విమానంలో వెళ్లనున్న గవర్నర్

* నేడు రాజమండ్రిలో మే 27, 28 తేదీల్లో జరగనున్న టిడిపి మహానాడుకు ఖరారైన వేదికను పరిశీలించనున్న పార్టీ రాష్ట్ర ప్రతినిధుల బృందం.. వేమగిరి వద్ద జాతీయ రహదారి పక్కన 38 ఎకరాల స్థలాన్ని సభా ప్రాంగణం కోసం ఎంపిక.. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధుల బృందం పర్యటన

* కడప : బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాల సందర్భంగా నేటి నుంచి మూడు రోజులు పాటు బద్వేల్ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు..

* కడప : జిల్లాలో ఇంటర్ ఫలితాలపై నేడు జిల్లా కలెక్టర్ సమీక్ష..

* విజయనగరం: నేడు కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం.. పాల్గొననున్న ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ సలహా మండలి సభ్యులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు.

* కడపకు చేరుకున్న సిబిఐ బృందం.. వివేకనంద రెడ్డి హత్య కేసులో విచారణ చేపడుతున్న సీబీఐ బృందంలోని పలువురు కడపకు రాక.. నేడు ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మలు కడపకు వచ్చే అవకాశం

* విశాఖ: నేడు ఐటీ హిల్స్ సందర్శించనున్న మంత్రి గుడివాడ అమర్నాథ్.. సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన ఏర్పాట్లు పరిశీలన.. మే3న అదానీ డేటా సెంటర్ కు శంఖుస్థాపన చేయనున్న సీఎం

* గన్నవరం స్వర్ణ భారత్ ట్రస్ట్ అధ్వర్యంలో స్వావలంబ భారత్ పేరిట రెండు రోజుల శిక్షణ శిబిరం.. ప్రారంభించనున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

* తిరుపతి: గంగాధర నెల్లూరు మండలం ఆంబోదరపల్లె పంచాయతీలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి

* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించనున్న మంత్రి హరీష్ రావు.. సిద్దాపూర్ లో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ లను పంపిణీ చేయనున్న హరీశ్ రావు.. న్యాలకల్ (మం) రాఘవపూర్ లో జరిగే మంజీరా కుంభమేళాలో పాల్గొననున్న హరీష్‌రావు..

* నేడు సిద్దిపేట జిల్లాలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటన.. మల్లన్న సాగర్ నుంచి కామారెడ్డి జిల్లాకి సాగునీరు వెళ్లే పనులు, విధానాన్ని అధికారులతో కలిసి పరిశీలించనున్న స్పీకర్ పోచారం

*ఖమ్మం: నేడు సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్

* వరంగల్: నేడు జనగామ జిల్లా, మహబూబాబాద్ జిల్లాలో వైఎస్‌ షర్మిల పర్యటన.. జనగామ జిల్లా బచ్చన్నపేట్ మండలం. డోర్నకల్ నియోజకవర్గం లో.. కురవి మండలం అయ్యగారిపల్లిలో పంట నష్టం పరిశీలించనున్న షర్మిల

Exit mobile version