NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* ఐపీఎల్‌: బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు బెంగళూరు-చెన్నై మధ్య మ్యాచ్‌

* నేడు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటన.. వన్‌ టౌన్‌ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో పాల్గొననున్న జగన్..

* రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన.. దుమాల గ్రామంలో యాదవుల మల్లన్న పట్నాలకు హాజరు.. రాజన్నపేట గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం.. దేవునిగుట్ట తండా( గొల్లపల్లి) గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం.. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరుపల్లి తండా (తిమ్మాపూర్)గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం.. రాచర్ల తిమ్మాపూర్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్

* నేడు విజయవాడ ఎన్ఐఎ కోర్టులో కోడి కత్తి కేసు విచారణ..

* ప్రకాశం : దోర్నాల మండలం చిన్నగుడిపాడులో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.

* ప్రకాశం : గిద్దలూరులో రంజాన్ మాసం సందర్బంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో ఇప్తార్ విందు..

* బాపట్ల : అద్దంకిలో మోడీని దింపండి, దేశాన్ని కాపాడండి నినాదంతో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రచార భేరి..

* వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ ముందుకు అవినాష్‌రెడ్డి..

* 73వ రోజుకు చేరిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతోన్న పాదయాత్ర.. ఎంకె కొట్టాల, గుండ్లకొండ, గుడిమిర్ల, బుర్రుకుంట, వెంకటాపురం మీదుగా పల్లెదొడ్డి వరకు సాగనున్న పాదయాత్ర..

* కడప: పులివెందులలోని భాకరాపురం నుంచి హైదరాబాద్ బయల్దేరిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి.. ఆయనతోపాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. మధ్యాహ్నం మూడు గంటలకు సీబీఐ విచారణకు హాజరుకానున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

* తూర్పుగోదావరి జిల్లా : తాళ్లపూడి మండలం తుప్పకులగూడెం గ్రామం లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొననున్న హోం మంత్రి తానేటి వనిత.. సాయంత్రం కొవ్వూరు టౌన్ ఇందిరమ్మ కాలనీలో జరుగు ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.

* తూర్పుగోదావరి జిల్లా : నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రాజమండ్రి కలెక్టరేట్ ఎదుట భారత్ సత్యాగ్రహ దీక్ష.. పాల్గొననున్న ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం ….ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించనున్న అధికారులు…

* గుంటూరు: ఈనెల 26 నుండి 29 వరకు తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో , వైయస్సార్ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో, జాతీయ స్థాయి ఆహ్వాన పోటీలు…

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.. అనంతరం మనుబోలు మండల్ లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు..

* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,201 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 28,587 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు

* కర్నూలు: నేడు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి మృతదేహానికి జీజీహెచ్‌లో పోస్టుమార్టం.. నిన్న బీచ్ పల్లి వద్ద కారు టైర్ పేలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నీరజారెడ్డి

* శ్రీ సత్య సాయి జిల్లా : హిందూపురంలోని శ్రీకంఠపురంలో నేటి నుంచి రెండు రోజుల పాటు ముత్యాలమ్మ జ్యోతుల ఉత్సవం.

* విజయవాడ : నేడు ఉమ్మడి కృష్ణజిల్లాలో విధులను బహిష్కరించనున్న న్యాయవాదులు .. సిఐడి పోలీసుల తీరును ఖండిస్తూ నిరసనకు పిలుపునిచ్చిన న్యాయవాదులు..

* పెద్దపల్లి జిల్లాలో 32వ రోజు కొనసాగునున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర.. నేడు 18 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న పాదయాత్ర.. రామగుండం నియోజకవర్గం మురుమూరు గ్రామం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర

* జగిత్యాల జిల్లా: నేడు ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం అధికారి విచారణ

Show comments