NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

నేటి నుంచి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేడు ఇంటర్ మొదటి ఏడాది పరీక్ష జరగనుంది. ఇంటర్ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించమని తెలిపారు.

నేడు తిరుపతి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా డిక్లరేషన్ సభ జరగనుంది. ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రం ఐదు గంటలకు సభ ఆరంభం అవుతుంది. ఈ సభకు వైఎస్ షర్మిల, సచిన్ ఫైలెట్, సీపీఐ నారాయణ, సీపీఎం నేతలు హాజరుకానున్నారు.

నేడు సీఎం జగన్ పామర్రులో పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. జగన్ పర్యటన సందర్భంగా విజయవాడ-మచిలీపట్నం రూట్లో ట్రాఫిక్ మల్లింపులు చేయనున్నారు.

ఈ రోజు బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమం జరుగనుంది. తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు బస్సులలో వెళ్లనున్నారు. ఉదయం 8.30కు తెలంగాణ భవన్ నుంచి బస్సులు ప్రారంభం ఆరంభం కానుంది. మొదట మేడిగడ్డలో బ్యారేజీ పరిశీలన ఉండగా.. ఆ తర్వాత అన్నారంకు వెళుతారు.

శ్రీశైలంలో ఈరోజు నుంచి మర్చి 11 వరకు 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున శ్రీస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ ఉంటుంది. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ చేయనున్నారు.

నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించనున్నారు.

ప్రొ కబడ్డీ సీజన్‌-10లో ఫైనల్‌కు వేళైంది. పుణెరి పల్టాన్‌, హరియాణా స్టీలర్స్‌ ఫైనల్లో తలపడనున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్టేడియం రెండు జట్ల మధ్య ఆసక్తికర సమరానికి వేదికగా నిలవనుంది.

Show comments