Site icon NTV Telugu

Peddi : ఏంది ‘పెద్ది’ ఇది.. ఇలా అయితే ఎలా?

Peddi

Peddi

ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ది చిత్రం గురించి జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. జూన్‌కి వాయిదా పడింది. కానీ, డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు మేకర్స్. దీంతో పెద్ది రిలీజ్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. స్పెషల్ సాంగ్‌తో పాటు ప్యాచ్ వర్క్ పెండింగ్‌లో ఉంది. దానికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవుతోంది. అసలు.. పెద్ది పోస్ట్‌పోన్‌కు మెయిన్ రీజన్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు.. రీ షూట్ చేస్తున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది.

Also Read : Balayya : బాలయ్య–కొరటాల కాంబోపై క్రేజీ బజ్.. మాస్ విధ్వంసమే

ఇలా ఒకటి కాదు.. పెద్ది గురించి ఏదో ఒక పుకారు షికారు చేస్తునే ఉంది. దీంతో.. పెద్ది జూన్‌లో కూడా రావడం కష్టమనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, మేకర్స్ పెద్ది కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తే ఇంత రచ్చ జరిగేది కాదు. కానీ, అలా జరగలేదు. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్‌పోన్ అయిన ఈ సినిమా.. మరోసారి వాయిదా పడకూడదనే ఉద్దేశ్యంతో.. ఈసారి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు మేకర్స్. సరైన అవుట్ పుట్ వచ్చి.. ఆల్ సెట్ అనుకున్నప్పుడే డేట్ ప్రకటించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయినా కూడా పుకార్లు మాత్రం ఆగడం లేదు. నిజం చెప్పాలంటే.. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర యూనిట్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ది ఎప్పుడొచ్చిన బాక్సాఫీస్ బద్దలవుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అలాగే ఉంది. కాబట్టి.. పెద్ది లేట్ అయినా పర్లేదనే కామెంట్స్ అభిమానుల నుంచి వస్తున్నాయి. అయితే, ఈ సినిమాను జూన్ 4 లేదా 25న రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Exit mobile version