NTV Telugu Site icon

Whats app: ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన వాట్సాప్

Whatsapp

Whatsapp

Whats app New Features For iOS Users: ఎప్పటికప్పుడు యూజర్లకు కావాల్సిన కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూ ఉంటుంది వాట్సాప్. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు యాప్ ను అప్డేట్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఐఫోన్ యూజర్లకు అదిపోయే ఫీచర్లను అందుబాటులోకి తీసువచ్చింది ఈ ఇన్ స్టాంట్ మెసేజింగ్ యాప్. iOS వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మనకు స్కీన్ షేర్ చేయాల్సిన అవసరం వస్తుంది. గూగుల్ మీట్, జూమ్ కాల్స్ లో ఈ సదుపాయం ఉంటుంది. అయితే తాజాగా వాట్సాప్ ఈ ఫీచర్ ను తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో డైరెక్ట్‌గా యూజర్లు స్క్రీన్‌ను షేర్ చేయవచ్చు. దీనికి సంబంధించి వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడే మనకు  స్క్రీన్ షేర్ బటన్‌ కనిపిస్తోంది. దీనిని క్లిక్ చేసి మనం అవతలివారికి స్ర్కీన్ షేర్ చేయవచ్చు. ఇది ప్రస్తుతానికి కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అన్నీ iOS వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

Also Read: Lancet study: పెరుగుతున్న కీళ్ల వ్యాధి.. 2050 నాటికి 100 కోట్ల మందికి

వాట్సాప్ తీసుకువచ్చిన మరో ఫీచర్ వీడియో మెసేజ్ రికార్డింగ్ ఫీచర్. చాటింగ్ చేసేటప్పుడు కేవలం టెక్స్ట్ లేదా వాయిస్ మెసేజ్ ను మాత్రమే ప్రస్తుతం వాట్సాప్ ద్వారా పంపగలుతున్నాం. అయితే ప్రస్తుతం వాట్సాప్ ఐఫోన్ యూజర్ల కోసం వీటికి బదులు మరో ఫీచర్ కూడా అందుబాటులోకి తెచ్చింది. అదే వీడియో మెసేజ్ రికార్డింగ్ ఫీచర్. దీనితో 60 సెకన్ల వరకు వీడియో రికార్డు చేసి నేరుగా సెండ్ చేయవచ్చు. దీనిని జస్ట్ మనం వాయిస్ నోట్ ను ఎలా పంపుతామో అలానే పంపించవచ్చు. అయితే దీనిలో మనం వీడియో రూపంలో పంపిస్తాం. ప్రస్తుతం ఇది iOS 23.16.78 కోసం వాట్సాప్ అప్‌డేట్ స్టోర్‌లో విడుదల చేయబడింది.