NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* నేడు బాబా సాహెడ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి.. దేశవ్యాప్తంగా ఉత్సవాలు

* హైదరాబాద్‌: నేడు 125 అడుగుల అంబేద్కర్‌ భారీ విగ్రహావిష్కరణ..

* అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాహనాల దారి మళ్లింపు.. నెక్లెస్‌ రోడ్‌, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, తెలుగుతల్లి జంక్షన్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

* నేడు మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్‌ భారీ బహిరంగసభ..

* ఐపీఎల్‌: నేడు రాత్రి 7.30 గంటలకు కోల్‌కతాతో హైదరాబాద్‌ ఢీ

* హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. రాబోయే 3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షం-ఐఎండీ

* నేడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నారాయణపేట్, నాగర్ కర్నూల్ జిల్లాలకు భారీ వర్ష సూచన – ఐఎండీ

* కాకినాడ: నేడు తునిలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా

* అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి వేణు

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మనుబోలులోని శ్రీ సంగమేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవంలో సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.. అనంతరం పొదలకూరులో జరిగే అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు

* నెల్లూరు: ఉదయగిరి మండలం గండిపాలెంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం

* నెల్లూరు: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నేటి నుంచి జిల్లా లోని పలు కేంద్రాల్లో వారం రోజులపాటు వారోత్సవాలు నిర్వహించనున్న అగ్నిమాపక శాఖ

* పశ్చిమ గోదావరి: తణుకులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..

* పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ..

* కాకినాడ: నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం.. జూన్ 14 వరకు నిషేధం అమలు.. జిల్లాలో 96 కిలోమీటర్ల తీర ప్రాంతం, ఆరు తీర ప్రాంత మండలాలలో 58 మత్స్యకార హ్యాబిటేషన్లు.. వేట ముగించుకుని ఒడ్డుకు చేరుకుంటున్న మత్స్యకారులు, బోట్లు

* అనంతపురం : మంత్రి ఉషశ్రీ పర్యటన వివరాలు.. కళ్యాణదుర్గంలో జరిగే అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .

* అనంతపురం : ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు.

* అనంతపురం : కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నేటి నుంచి ప్రచారభేరి కార్యక్రమం.

* విజయవాడ : నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 132వ అంబేద్కర్ జయంతి వేడుకలు.. హాజరుకానున్న మంత్రి మేరుగు నాగార్జున..

* కృష్ణ జిల్లా : పెడన నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ధి కార్యాక్రమాల్లో పాల్గొననున్న మంత్రి జోగి రమేష్..

* విజయవాడ : నేటి నుండి అగ్నిమాపక వారోత్సవాలు.. ఈ నెల 20 వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక శాఖ.

* 70వ రోజుకు చేరిన టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. గుడిపాడు, హెచ్ఆర్ పల్లి, పూదొడ్డి, మందొడ్డి క్రాస్, ప్యాపిలి, ప్యాపిలిలో బహిరంగసభ. పొలిమేరమెట్ట వరకు సాగనున్న పాదయాత్ర

* పల్నాడు : నేడు సత్తెనపల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో నూతన ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించనున్న మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ శివ శంకర్ తదితరులు…

* పల్నాడు : నేడు చిలకలూరిపేట 37వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడదల రజని.

* మంచిర్యాల: నేడు నస్పూర్ లో కాంగ్రెస్ పార్టీ భారత్ సత్యాగ్రహ సభ.. భట్టి పాదయాత్రలో భాగంగా మంచిర్యాల లో మొదటి భారీ బహిరంగ సభ.. సభ హాజరుకానున్న ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.