Salaar : సలార్ ఓటీటీ రన్ టైం ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్బాస్టర్ మూవీ సలార్.. ఈ సినిమాను కెజిఎఫ్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. సలార్ మూవీ గత ఏడాది డిసెంబర్ 22 న విడుదలయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ మూవీకి రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రంతో ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. సలార్‌లో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.సలార్ సినిమాలో ప్రభాస్‌తో పాటు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. శృతి హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో జగపతిబాబు, ఈశ్వరిరావు, టినూ ఆనంద్, బాబి సింహా, శ్రీయారెడ్డి, దేవరాజ్ మరియు రామచంద్ర రాజు ముఖ్య పాత్రలు పోషించారు.సలార్ చిత్రాన్ని హెంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు.
ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్కు తీసుకొస్తుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే, సర్ప్రైజ్గా అనుకున్న దాని కంటే ముందుగానే రేపు (జనవరి 20) ఈ చిత్రం స్ట్రీమింగ్కు వస్తుందని ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నేడు (జనవరి 19) న ప్రకటించింది.అంచనా వేసిన సమయం కంటే ముందే ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తూ ప్రేక్షకులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. జనవరి 20 అర్ధరాత్రి 12 గంటలకు సలార్ స్ట్రీమింగ్కు వస్తుందని అధికారికంగా వెల్లడించింది.అయితే సలార్ సినిమా ఓటీటీ వెర్షన్లో.. థియేటర్ లో ప్రదర్శించని కొన్ని సీన్లు ఉంటాయని ఇటీవల రూమర్లు వచ్చాయి. దీంతో కొన్ని అదనపు సీన్లతో నెట్‌ఫ్లిక్స్‌లో సలార్ స్ట్రీమింగ్ అవుతుందని టాక్ బయటికి వచ్చింది. అయితే, రేపు (జనవరి 20) సలార్ స్ట్రీమింగ్కు వస్తున్న క్రమంలో ఓటీటీ రన్ టైమ్ వెల్లడైంది.సలార్ సినిమా రన్ టైమ్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో సుమారు 2 గంటల 55 నిమిషాల పాటు ఉండనుందని ఓటీటీ ప్లే రిపోర్ట్ పేర్కొంది. థియేటర్లలోనూ ఈ మూవీ రన్ టైమ్ ఇలాగే ఉంది. దీన్ని బట్టి చూస్తే ఓటీటీలో సలార్‌కు అదనపు సీన్లు ఉండవు. థియేటర్ వెర్షన్‌నే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది. దీంతో, ఓటీటీలోకి ఎక్స్ట్రా సీన్లతో సలార్ వస్తుందన్న రూమర్లకు చెక్ పడింది
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- Tags
- prabhas
- Prashanth Neel
- salaar
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!