Site icon NTV Telugu

IPL Final: వర్షం వల్ల ఫైనల్ మ్యాచ్ రద్దైతే.. ఐపీఎల్ టైటిల్ గెలిచేది ఆ జట్టే..?

Srh Vs Kkr

Srh Vs Kkr

IPL Final: ఐపీఎల్‌-2024 ఫైనల్‌ పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ చెపాక్‌ స్టేడియం వేదికగా ఈ టైటిల్‌ పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అమీతుమీ తెల్చుకోబోతునున్నాయి. ఇక, తొలి క్వాలిఫయర్‌లో ఇరు జట్ల మధ్య జరిగింది. అనంతరం రెండో క్వాలిఫయర్‌లో​ రాజస్తాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసిన హైదరాబాద్.. ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో కేకేఆర్‌ మూడో టైటిల్‌పై కన్నువేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో సారి టైటిల్‌ను ముద్దాడాలని చూస్తుంది. ఇక, ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్‌ లీగ్‌ దశలో పలు మ్యాచులు వర్షం దెబ్బకు క్యాన్సిల్ అయింది.

Read Also: Kolkata Airport : కోల్‌కతా ఎయిర్ పోర్టు 21 గంటలు క్లోజ్.. డజన్ల కొద్దీ విమానాలు రద్దు

ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి రద్దు అయితే పరిస్థితి ఏంటి అని క్రికెట్ అభిమానులు తెగ టెన్షన్‌ పడుతున్నారు. కాగా, ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు బీసీసీఐ రిజర్వ్‌ డేను కేటాయించింది. వర్షం వల్ల పూర్తిగా మ్యాచ్‌ మొదులు కాకపోతే రిజర్వ్‌ డే అయిన సోమ‌వారం మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఒకవేళ మ్యాచ్‌ ప్రారంభమై మధ్యలో ఆగిపోతే.. నేడు (ఆదివారం) మ్యాచ్ ఎక్కడైతే ఆగింతో అక్కడి నుంచే రేపు ఆటను కొనసాగిస్తారు. ఒక‌వేళ సోమ‌వారం కూడా మ్యాచ్‌ను నిర్వహించేందుకు ఛాన్స్ లేకపోతే.. పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్ గా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టును విజేతగా ప్రకటించనుంది బీసీసీఐ. కాగా కనీసం సూపర్‌ ఓవర్‌ నిర్వహించేందుకు భారత కాలమానం ప్రకారం రాత్రి 1:20 వరకు సమయం ఉంటుంది. కాగా గతేడాది సీజన్‌ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే వచ్చింది.

Exit mobile version