అదేదో యాడ్ లో చూపిస్తారు.. పెర్ఫ్యూమ్స్ స్ప్రే చేయగానే వారి వెంట ఆడవారు పడతారు.. కానీ రియాల్టీలో మరి అంతలా ఉండదు.. కానీ కొన్ని పెర్ఫ్యూమ్స్ కి చాలా మంది అట్రాక్ట్ అయిపోతారు. కొన్ని రొమాంటిక్ మూడ్ ని క్రియేట్ చేస్తాయి. రొమాన్స్ లో పెర్ఫ్యూమ్స్ కూడా కీ రొల్ పోషిస్తాయి. అందుకే మీరు ఆ సమయంలో ఆడవారిని మీ వైపుకి ఆకర్షించాలంటే కొన్ని పెర్ఫ్యూమ్స్ హెల్ప్ చేస్తాయి. కొన్ని ప్లేవర్స్ అంటే ఆడవారికి ఎప్పుడు ఫేవరేట్.. వీటిని చాలా మంది ఆడవారు స్ర్పే చేస్తారు. ఇందులో ఏయే ప్లేవర్స్ ఉన్నాయంటే.. స్ట్రాబెర్రీస్, ద్రాక్ష, మామిడి, చెర్రి, నారింజ, లెమన్ ఘాటుగా ఉండుద్దండోయ్.. అప్పుడు ప్రూట్ సలాడ్ లా మారుతుంది యవ్వారం. కాబట్టి మైల్డ్ గా ఉండేవాటిని ఎంచుకోండి. వెనీల్లా ప్లేవర్ ఐస్ క్రీమ్స్ మాత్రమే కాదండీ.. పెర్ఫ్యూమ్స్ లో కూడా ఉంటుంది. దీనిని ఆల్ టైమ్ ఫేవరేట్ అని చెప్పొచ్చు. మీరు బాడీ ఆయిల్, పెర్ఫ్యూమ్స్ ని ఈ ఫ్లేవర్ లో ట్రై చేసి చూడండి. జరిగే రొమాంటిక్ నైట్ గురించీ మీకే తెలుస్తుంది.
Also Read : Priyanka Chopra: బెడ్ సీన్స్ .. ఆ పార్ట్స్ కనిపించకుండా చేతులను అడ్డుపెట్టి
ఈ రోజుల్లో పూలు ఎవరు పెట్టుకుంటున్నారు. వాటిని ఎవరు పెద్దగా ఇష్టపడుతున్నారనుకోవద్దు. ఇది ఏ టైమ్ లో అయినా పూల గమ్మత్తుని మీ చుట్టూ ఉండేలా చూస్తుంది. అయితే, కొంతమందికి దీని వల్ల తలనొప్పి కూడా వస్తుంది. కానీ.. ఆడవారిలో ఇది చాలా మంది ఫేవరేట్. దీనిని వాడడం వల్ల కూడా మీరు వారిని మీ మత్తులో ముంచొచ్చు.. గంధం, చందనం.. ఇవి పూరాతన కాలం నుంచి సువాసనల కోసమే వాడతారు. దీనిని చాలా మంది ఇష్టపడతారు. వీటిని మీరు ఏ టైమ్ లో అయినా వాడొచ్చు. దీంతో ఆడవారి మూడ్ క్షణాల్లో మారి మీ చెంతకి చేరుతారు. ఈ పూల వాసన నిజానికి మహత్తుని చూపిస్తుందంటే.. అది అనుభవించి తీరాల్సిందే.. దీని సువాసన ఒక్కసారిగా మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. అందుకే చాలా మంది లేడీస్ ఈ ఫ్లేవర్ ఉంటే పెర్ఫ్యూమ్స్ ను ఎక్కువగా ఇష్టపడతారు.
Also Read : CometLabs: హైరింగ్ టెక్నాలజీలకు కేరాఫ్ అడ్రస్ ‘కోమెట్‌ల్యాబ్స్’ ప్రశాంత్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను తీసుకోవాల్సిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు Ntvtelugu.com బాధ్యత వహించదు.