Site icon NTV Telugu

Exit poll History: ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటో తెలుసా? దేశంలో ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే!

Exit Poll

Exit Poll

Exit poll History: దేశ వ్యాప్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఈ రాష్ట్రంలో అధికార కూటమి విజయ దుందుభి మోగిస్తుందా లేదంటే ప్రతిపక్ష కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా అనేది నవంబర్ 14న తెలిసిపోనుంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన రెండు దశల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో, ప్రజల మనోభావాలను అంచనా వేయడానికి టీవీ ఛానెల్స్, సర్వే ఏజెన్సీలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తాయి. ఇంతకీ ఎగ్జిట్ పోల్ అంటే ఏమిటి, దాని ఉద్దేశ్యం, అది మొదట ఎక్కడ ప్రారంభం అయ్యాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Jubilee Hills Bypoll : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన.. పలువురిపై కేసులు నమోదు

ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ ప్రారంభం అయ్యాయంటే..
ఎగ్జిట్ పోల్ అనేది ఓటింగ్ ముగిసిన వెంటనే నిర్వహించే సర్వే. దీంట్లో జర్నలిస్టులు లేదా సర్వే సంస్థలు ఓటు వేసిన ఓటర్లను ఏ పార్టీకి లేదా అభ్యర్థికి ఓటు వేశారని అడుగుతాయి. ఈ సమాధానాల ఆధారంగా, ఏ పార్టీ లేదా అభ్యర్థి గెలిచే అవకాశం ఉందో, ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో అంచనాలు విడుదల చేస్తారు. వాస్తవానికి ఎగ్జిట్ పోలింగ్ అనేది మొట్ట మొదటిసారిగా అగ్రరాజ్యం అమెరికాలో ప్రారంభం అయ్యింది. అమెరికాలో 1967లో అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త వారెన్ మిటోఫ్స్కీ మొదటి ఎగ్జిట్ పోల్‌ను నిర్వహించారు. ఈ టెక్నిక్ తరువాత 1972 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విస్తృతంగా ఉపయోగించారు. తదనంతరం దీనిని బ్రిటన్, జర్మనీ భారతదేశంతో సహా అనేక దేశాలు అనుసరించాయి. 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో భారతదేశంలో ఎగ్జిట్ పోల్స్ ప్రారంభమయ్యాయి. మొదటిసారి ఈ ఎగ్జిట్ పోల్స్‌ను దూరదర్శన్, మరికొన్ని ప్రైవేట్ ఛానెళ్లు సంయుక్తంగా ప్రసారం చేశాయి.

READ ALSO: IPL 2026 Auction: ఆ రోజే ఐపీఎల్ 2026 వేలం! ఎక్కడ జరుగుతుందంటే..

Exit mobile version