Four West Indies Players Retirements: వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్. ఒకేసారి నలుగురు మహిళా స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ఇచ్చారు. అనిసా మొహమ్మద్, షకేరా సెల్మాన్, కైసియా నైట్ మరియు కిషోనా నైట్‌లు గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని వెస్టిండీస్ బోర్డు ధృవీకరించింది. ఈ నలుగురు వెస్టిండీస్ తరఫున అద్భుతమైన కెరీర్‌లను కలిగి ఉన్నారు. వీరు విండీస్ మహిళా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు భారతదేశంలో జరిగిన 2016 మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆడిన విండీస్ జట్టులో సభ్యులు కూడా. నలుగురు క్రికెటర్లు ఒకేసారి వీడ్కోలు పలకడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఆఫ్ స్పిన్నర్ అనిసా మొహమ్మద్ 2003లో తొలి వన్డే మ్యాచ్ ఆడింది. 20 ఏళ్ల కెరీర్‌లో 141 వన్డే మ్యాచ్‌లలో 141 వికెట్లు, 117 టీ20 మ్యాచ్‌లలో 125 వికెట్లు పడగొట్టింది. వెస్టిండీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు ఆమె పేరుపైనే ఉంది. టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన తొలి విండీస్ బౌలర్ కూడా అనిసానే. కెరీర్‌లో ఏడు టీ20 ప్రపంచకప్‌లు, ఓ వన్డే ప్రపంచకప్ ఆడింది. పేసర్ షకేరా సెల్మాన్ 2008లో వన్డేల్లో అరంగేట్రం చేసింది. 100 వన్డేల్లో 82 వికెట్లు, 96 టీ20ల్లో 51 వికెట్లు పడగొట్టింది.
Also Read: Extra Ordinary Man OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ట్విన్ సిస్టర్స్ కైసియా నైట్, కిషోనా నైట్‌లు రెండేండ్ల వ్యవధిలో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కైసియా 87 వన్డేల్లో 1327 పరుగులు, 70 టీ20ల్లో 801 రన్స్ చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ కిషోనా 51 వన్డేల్లో 851 రన్స్, 55 టీ20ల్లో 546 పరుగులు చేసింది.