ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొట్టుకొని చాలా మంది ప్రాణాలను కోల్పోయారు.. వందల మంది గాయాలపాలయ్యారు..ఈ ప్రమాదం లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది..రైలు ప్రమాద క్షతగాత్రులు బస్సు ప్రమాదంలో మరోసారి గాయపడ్డారు. పశ్చిమబెంగాల్ కు చెందిన కొంతమంది ప్రయాణికులు బాలాసోర్ సమీపంలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో గాయపడ్డారు..
వారందరిని ప్రత్యేక బస్సులో ఆ రాష్ట్రానికి తరలిస్తున్నారు. అయితే, రైలు ప్రమాదంలో గాయపడిన వారితో వెళ్తున్న బస్సు పశ్చిమ బెంగాల్ లోని మేదినీపూర్ లో శనివారం ప్రమాదానికి గురైంది.. ఒక వాహనాన్ని బస్సు ఢీ కొట్టింది.. ఆ ప్రమాదంతో మరోసారి గుండె ఆగినంత పనైంది.. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.. మరోసారి గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, రైళ్ల ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి గాయాలతో తమ ఊర్లకు వెళ్తోన్న ప్రయాణికులు మరోసారి బస్సు ప్రమాదంలో గాయపడటం స్థానికంగా కలకలం రేపింది..
ఒడిశాలోని బలాసోర్ సమీపంలో శుక్రవారం లూప్ లైన్ పై ఆగి ఉన్న గూడ్స్ రైలును షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది..అయితే కొన్ని నిమిషాల్లోనే మెయిన్ లైన్ లో వచ్చిన యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్, ఆ పట్టాలపై పడిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలను ఢీకొని పట్టాలు తప్పింది. గత రెండు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 300 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తుంది..800 మంది తీవ్రంగా గాయపడ్డారు..