Site icon NTV Telugu

Live Incident: తెల్లారితే ఎగ్జామ్.. కష్టపడి చదివాడు.. కళ్లెదుటే చనిపోయాడు

Fall

Fall

Live Incident: తన కొడుకు డాక్టర్ అవుతాడని పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంటి దగ్గర ఉంటే డిస్టర్బెన్స్ అవుతుందని ఫ్రెండ్స్ తో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. నీట్ ఎగ్జామ్ కోసం కష్టపడి చదువుతున్నాడు. కానీ.. ఊహించకుండా కళ్లెదుటే కనుమూశాడు. రాజస్తాన్ లోని కోటాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి ప్రమాదవ శాత్తు 6వ అంతస్తు నుంచి పడి మృతి చెందాడు. దీంతో అతడి ఫ్రెండ్స్ షాక్ కి గురయ్యారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన ఇషాంషు భట్టాచార్య అనే విద్యార్థి నీట్ కోచింగ్ కోసం కోటాలోని కోచింగ్ ఇన్ స్టిట్యూట్ కు వచ్చాడు. హాస్టల్ లో ఉంటున్నాడు. కాగా, అదే హాస్టల్ భవనంలోని ఆరో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడిపోయాడు. అంత ఎత్తు నుంచి కిందకు పడటంతో అతడు తీవ్ర గాయాలతో స్పాట్ లోనే చనిపోయాడు. తమ కళ్ల ముందే భట్టాచార్య కిందకి పడి చనిపోవడం ఫ్రెండ్స్ ను షాక్ కి గురి చేసింది.

Read Also: Fire In Mumbai : ముంబైలో భారీ అగ్నిప్రమాదం, అదుపులోకి రాని మంటలు

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భట్టాచార్య ఆగస్టులో రాజస్తాన్ కు వచ్చాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ హాస్టల్ లో ఉంటూ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ కు ప్రిపేర్ అవుతున్నాడు. అప్పటి వరకు బిల్డింగ్ 6వ అంతస్తు బాల్కనీలో ముచ్చట్లు పెట్టాడు. నలుగురూ చాలా సేపు సరదాగా మాట్లాడుకున్నారు. హ్యాపీగా గడిపారు. అర్థరాత్రి దాటాక రూమ్ కి వెళ్లేందుకు అంతా లేచారు. భట్టాచార్య తన కాళ్లకు చెప్పులు వేసుకుని వెళ్లే ప్రయత్నంలో బ్యాలెన్స్ కోసం వెనుకున్న రెయిలింగ్ ని అనుకున్నాడు. ఆ రైలింగ్ ఊడిపోయింది. అంతే, 6వ అంతస్తు నుంచి అతడు కింద పడి చనిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్ల ముందే స్నేహితుడు చనిపోవడం చూసి ఫ్రెండ్స్ షాక్ లో ఉండిపోయారు.

Exit mobile version