NTV Telugu Site icon

Weight Loss : అధిక బరువుకు చెక్ పెట్టాలంటే.. ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి..

Weight Loss

Weight Loss

అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. బరువు ఎక్కువగా ఉండటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొన్ని సార్లు ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండాలంటే ఇప్పుడు చెప్పే నియమాలను పాటించడం చాలా అవసరం.. అవేంటో ఒకసారి చూసేద్దాం..

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి అధిక బరువు కూడా ఒక కారణం. శరీరం యొక్క బరువు పెరిగితే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి.. అధిక ఒత్తిడి వల్ల బరువు కూడా ఈజీగా పెరుగుతారు.. అందుకే వీలైనంతవరకు ఒత్తిడిని తగ్గించుకోవాలి.. అందుకోసం ధ్యానం, యోగా వంటి వాటిని చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోవాలి. అధికంగా ఆల్కహాల్ ను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తో పాటు ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు కూడా పెరుగుతాయి.. అలాగే ఆల్కాహాల్ ను మితంగా తీసుకోవడం మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంచుకోవాలనుకునే వారు పోషకాలు కలిగిన అల్పాహారాన్ని తీసుకోవాలి.

అలాగే మనం తీసుకునే ఆహరంలో మంచి కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. అవకాడో, కోడిగుడ్డు తెల్లసొన వంటి వాటిని తీసుకోవాలి.. ముఖ్యంగా ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ లకు దూరంగా ఉండాలి.. శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి.. చేపలు, చిక్కుళ్లు, గింజలు వంటి వాటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను ఎక్కువగా పెంచే వాటిలో ధూమపానం కూడా ఒకటి. ధూమపానం కారణంగా హృదయ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి వీటిని దూరంగా ఉంచుకోవడం మంచిది.. శరీరానికి కాస్త వ్యాయామం కూడా అవసరం..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.