NTV Telugu Site icon

Weight Loss Tips : బరువు పెరుగుతున్నారా? అయితే ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి..

Weight Loss

Weight Loss

ఈరోజుల్లో ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల అధిక బరువు పెరుగుతున్నారు.. తిన్న ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల కూడా కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు.. బరువు పెరగడం, పొట్ట రావడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలుగుతుంది. అధిక బరువు కారణంగా గుండె సమస్యలు రావడంతో పాటుగా, అధిక రక్తపోటు, ఉబకాయం కూడా వస్తుంది.. ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు స్థూలకాయంతో ఇబ్బంది పడుతుంటే, బరువు తగ్గాలనుకుంటే మీరు ఈ 5 బరువు తగ్గించే చిట్కాలను అనుసరించవచ్చు.. అవేంటో ఒక్కసారి చూసేద్దాం..

బరువు పెరగడానికి కారణం మితంగా ఆహారాన్ని తీసుకోవడమే.. అధిక కేలరీల కారణంగా బరువు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. ఇటువంటి పరిస్థితిలో కేలరీలను బర్న్ చేయడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి… కొంతవరకు శారీరక శ్రమ ఇవ్వడం చాలా మంచిది..

బయట తినడం వల్ల బరువు పెరుగుతారు. వీటికి బదులు పౌష్టికాహారం తీసుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు ఉండాలి..

బరువు తగ్గాలంటే శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. దీని కోసం తగినంత నీరు త్రాగాలి. అదనపు కేలరీలను బర్న్ చేయడంలో నీరు త్రాగటం సహాయపడుతుంది.. నీరును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలి వెయ్యకుండా ఉంటుంది.. ప్యాక్ చేసిన ఆహారం, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, చక్కెర పానీయాలు, స్నాక్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిని తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు.. అదనపు కొవ్వులు ఎక్కువగా ఉండటం బరువు పెరుగుతారు.. ఎప్పుడో ఒక్కసారి తీసుకుంటే మంచిది.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఉంటే మంచిది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.