NTV Telugu Site icon

Wednesday: బుధవారం రోజు తల స్నానం చేస్తున్నారా..? ఇది మీ కోసమే..

Head Bath

Head Bath

డబ్బు మీద పిచ్చితో చాలా మంది తినడానికి, స్నానం చెయ్యడానికి కూడా తీరిక లేనంత బిజీగా ఉన్నారు.. కొందరు అయితే స్నానాలు కూడా చెయ్యలేనంత బిజీగా ఉన్నారు.. ఆఫీసులకు వెళ్లేవారు రాత్రి సమయంలోనే స్నానం చేసి ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేయకుండా అలాగే వెళ్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు.. అయితే మామూలుగా మనం వారాలతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తల స్నానం చేస్తూ ఉంటాం. కానీ అలా చేయకూడదు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. వాస్తు శాస్త్రంగా కొన్ని రోజుల్లో తల స్నానం అస్సలు చేయకూడదు.. మరి ఏ రోజుల్లో చెయ్యకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆదివారం రోజున తలస్నానం చేస్తే అందం తగ్గుతుంది. కలత, సంతాపం కలుగుతుంది. ఒకవేళ అవసరమైతే నూనెలో పువ్వులు వేసి తలంటుకుని స్నానం చేయాలి. అలాగే సోమవారం రోజున తలస్నానం చేయడం అంత మంచిది కాదు. ఒకవేళ చేస్తే కాంతి హీనత, భయం ఉంటుందట. మంగళవారం రోజు తలస్నానం చేస్తే విరోధం, అపాయం, ఆయుఃక్షీణం, భర్తకు పీడ కలుగుతుంది.ఇక బుధవారం రోజు తలస్నానం చేస్తే అన్నివిధాలా శుభం.

ఇక గురువారం రోజు తలస్నానం చేయడం వల్ల అంతా మంచే జరుగుతుంది. అశాంతి, విద్యా లోపం, ధన వ్యయం, కీడు, శత్రు వృద్ధి.. ఇకపోతే నూనెలో గరిక వేసి తలంటు స్నానం చేయాలి. శుక్రవారం రోజున తలస్నానం చేస్తే అశాంతి, వస్తునాశం, రోగప్రదం. కానీ కొందరు సౌఖ్యప్రదం. శనివారం రోజున తలస్నానం చేయడం వలన ఆయుర్వృద్ధి, వస్తు సేకరణ, యోగం, శుభం కలుగుతుంది.. అంటే శనివారం, బుధవారం స్నానం చెయ్యడం అన్ని విధాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు..