రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే దేశంలోనే నెంబర్1గా అమరావతిని తీర్చిదిద్దుతానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని లక్ష్యంతో చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులు వేసి అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పట్టణంలోని పీఈపీఎల్ శ్రీ బాలాజీ ఫార్చ్యూన్ టవర్స్ లో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం ద్వారా అక్కడ నివాసితులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా 2014లో కట్టుబట్టలతో ఇక్కడకు వచ్చామన్నారు. ఆనాడు అమరావతిని అందరి ఆమోదంతో రాజధానిగా ఏర్పాటుచేసుకున్నాం.. అభివృద్ధి వికేంద్రీకరణకు పెద్దపీట వేశాం.. రాష్ట్ర ప్రజలు ఒక్క ఛాన్స్ మాయలో జగన్ కు ఓటు వేశారు అని ఆయన ఆరోపించారు. వైసీపీ వచ్చిన తర్వాత అమరావతిని విధ్వంసం చేశారు.. ఇక్కడ పనులు ఆగిపోవడానికి ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డే కారణం. కేసులు వేసి రాజధాని ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నారు అని తెలిపారు. ఉపాధి కోసం మన ప్రాంత యువత హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లే పరిస్థితి నెలకొంది.. ప్రజాప్రభుత్వం వచ్చాక అమరావతికి పూర్వవైభవం తీసుకువస్తాం.. మన ప్రాంతంలోనే పరిశ్రమలు ఏర్పాటుచేసి పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అని నారా లోకేష్ వెల్లడించారు.
Read Also: Farmers Protest: కేంద్ర సర్కార్ తీరుపై రైతుల ఆగ్రహం.. నల్లజెండాలు ఎగురవేయాలని పిలుపు
2019 ఎన్నికల్లో 21 రోజుల ముందు నేను మంగళగిరికి వచ్చాను అని నారా లోకేష్ తెలిపారు. ప్రతిపక్షంలోనే ఇక్కడకు రెండు ఐటీ కంపెనీలు తీసుకువచ్చి 150 మందికి ఉద్యోగాలు కల్పించాం.. నన్ను, పెమ్మసాని చంద్రశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి.. డబుల్ ఇంజన్ లా పని చేసి మంగళగిరి రూపురేఖలు మారుస్తాం.. బ్లాక్ డెవలప్ మెంట్ విధానంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్క్ లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తాం.. ప్రతి గడపకు సురక్షితమైన తాగునీరు అందిస్తాం.. మంగళగిరి మీదుగా వెళ్లే బస్సులు, రైళ్లు ఇక్కడ ఆగేవిధంగా చర్యలు తీసుకుంటాం.. మంగళగిరిని గోల్డ్ క్లస్టర్ గా మారుస్తామని లోకేష్ పేర్కొన్నారు.
Read Also: BRS MPS: ఇదంతా కక్ష సాధింపే.. కవిత అరెస్టుపై బీఆర్‌ఎస్ ఎంపీలు ఫైర్
టీడీపీ గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈసారి కేవలం రాజకీయంగా అధికార మార్పిడికి సంబంధించినది కాదు.. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్ కు సంబంధించినదన్నారు. అమరావతిని కాపాడుకోవడానికి, చదుకున్న బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి.. ఇవాళ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందంటే అందుకు కారణం చంద్రబాబునాయుడు విజనే కారణం.. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే అమరావతి కూడా అభివృద్ధి చెంది ఉండేది అని ఆయన అన్నారు. రాష్ట్రానికి మధ్యలో ఉంది.. నీటి వనరులు ఉన్నాయని ఆనాడు అమరావతిని రాజధానిగా చేశారు.. వైసీపీ వచ్చిన తర్వాత అంతా నాశనం చేశారు.. డబ్బు, పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు.. గుంటూరు ప్రజలకు సేవ చేసేందుకే వచ్చా.. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తాం.. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించి లోకేష్ ను, నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి అని పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు.
Read Also: Mumbai: 15 అడుగుల లోతైన పబ్లిక్ టాయిలెట్ గుంతలో పడిన ముగ్గురు వ్యక్తులు
ఇక, మంగళగిరి జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వైసీపీ విధ్వంసక విధానాలతో మంగళగిరిలో ఒకతరం భవిష్యత్ దెబ్బతింది. పెట్టుబడులు, పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయి.. సంపద సృష్టించే వారిని తరిమికొట్టారు.. విచ్ఛిన్న శక్తులకు అడ్డుకట్టపడాలంటే లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ను గెలిపించాలి అని ఆయన కోరారు. మంగళగిరి రైల్వే స్టేషన్, బస్టాండ్ లో అన్ని ట్రైన్లు, బస్సులు ఆగేవిధంగా చూడాలి.. లోకేష్ వినూత్న రీతిలో రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడం అభినందనీయమన్నారు.
