We Love Reading: విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేలా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.. We Love Reading పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.. ఈ వేసవి సెలవుల్లో కార్యక్రమం అమలు చేయనున్నారు.. కార్యక్రమం అమలుపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్.. ప్రతి టీచర్ కొందరు విద్యార్థులకు మెంటర్లుగా We Love Reading కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు.. స్కూళ్లల్లోని లైబ్రరీ నుంచి విద్యార్థులకు పుస్తకాల పంపకం జరగాలన్నారు.. ఏప్రిల్ 29వ తేదీన పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని తెలిపారు. విద్యార్థుల వార్షిక పరీక్ష ఫలితాలను విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేయనున్నారు టీచర్లు.. విద్యార్థుల అకాడమిక్ స్థితిగతులపై తల్లిదండ్రులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Read Also: Bopparaju Venkateswarlu: జీవో ఇచ్చే వరకు ఉద్యమ కార్యాచరణ నిలిపేది లేదు..!
కాగా, స్మార్ట్ ఫోన్లు, వీడియో గేమ్‌లు, ఇంటర్నెట్‌లతో కాలం గడిపే చిన్నారుల్లో సృజనాత్మకశక్తి పూర్తిగా తగ్గిపోవడంతో పాటు వారిలో ఊబకాయం తదితర దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అనేక సర్వేలు వెల్లడించాయి. ‘మీ పిల్లలు తెలివిగల వాళ్లు కావాలంటే వారికి రోజూ కథలు చెప్పండి’అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పారంటే.. చిన్నారుల జీవితాలను కథలు ఎంతగా ప్రభావితం చేయగలవో అర్థం అవుతుంది. దానికి అనుగుణంగా ఏపీ విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.. ఒక మంచి పుస్తకం ఉత్తమ మిత్రుడితో సమానం, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ, ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్న పెద్దల మాటలు అక్షర సత్యాలు అనడంలో అతిశయోక్తి లేదు.. కానీ, ప్రపంచీకరణ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ, కంప్యూటర్, చరవాణి, ట్యాబ్, దూరదర్శన్, ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ తదితర వాటితో నేటి యువత మమేకమై వ్యసనపరులవుతోన్న నేపథ్యంలో ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థుల్లో పఠన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఇది ఎంతో ఉపయోగపడనుంది.