Site icon NTV Telugu

Padma Rao Goud: బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ను ఎంతో అభివృద్ది చేశాం..

Padma

Padma

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్ పేటలో బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి ఇంటింటికి వెళ్లి ఓటర్లకు వివరిస్తున్నారు. ఇక, బీఆర్ఎస్ నేతలకు అడుగడుగునా మంగహారతులు, పూలమాలలతో పార్టీ నేతలు, నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలుకుతున్నారు.

Read Also: Patang: యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప‌తంగ్ అంద‌రి మ‌న‌సుల‌కు హ‌త్తుకుంటుంది..

ఇక, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల పాలనలో హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మేము చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, మేము ఏం చేశామో చెప్పి ఓట్లు అడుగుతాం.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలి అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.

Exit mobile version