Rahul gandhi: రాయ్‌బరేలీ, వయనాడ్.. ఏది వదులుకుంటారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రెండు చోట్ల రాహుల్ గాంధీ అనూహ్యమైన విజయాన్ని సాధించారు. విక్టరీనే కాదు.. భారీ మెజార్టీ కూడా సాధించారు. దీంతో ఆయన గురించి తాజాగా చర్చ సాగుతోంది. కంచుకోట రాయ్‌బరేలీలో.. కేరళలోని వయనాడ్ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు ఆ రెండింటిలో ఏ సీటు వదులుకుంటారని చర్చ జరుగుతోంది.
గత ఎన్నికల్లో కూడా రాహుల్ రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. అప్పుడు అమేథీలో ఓడిపోయి.. వయనాడ్‌లో గెలుపొందారు. ఈ సారి కూడా అలాగే పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా సాగింది. అమేథీలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కేఎల్.శర్మకు ఇచ్చారు. అనూహ్యంగా శర్మ ఇక్కడ భారీ విక్టరీ సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ చేశారు. ఈ రెండు చోట్ల కూడా రాహుల్ గెలుపొందారు. అంతేకాదు భారీ మెజార్టీ సాధించారు. ఇప్పుడు ఏదో ఒక సీటు వదులుకోవల్సి ఉంటుంది. కంచుకోటను వదులుకుంటారా? లేదంటే ఆపన్నహస్తం అందించిన వయనాడ్‌ను వదులుకుంటారా? అన్నది చర్చ సాగుతోంది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అయితే రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. కంచుకోట రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకాగాంధీని దించాలని భావిస్తున్నారు. ప్రియాంక ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు మంచి అవకాశం వచ్చింది. వాస్తవానికి ఈ సీటు సోనియాగాంధీది. అయితే ఆరోగ్యరీత్యా ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కాబట్టి ఆ స్థానంలో ప్రియాంకను రంగంలోకి దించాలని భావిస్తున్నారు.
ఇక రాహుల్.. రాయ్‌బరేలీలో 3 లక్షల ఓట్లకు పైగా.. వయనాడ్‌లో రెండోసారి 3.64లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో రాహుల్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో వయనాడ్ నుంచే రాహుల్ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!