NTV Telugu Site icon

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజ్ నీటిమట్టం..

Sagar

Sagar

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ లో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది.. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా.. సాగర్‌లోకి నీరు రావడం లేదు.. కృష్ణా బేసిన్‌లో ఇన్‌ప్లో అంతంత మాత్రంగానే ఉండడంతో.. ఇప్పటి వరకు నాగార్జున సాగర్‌కు నీరు వచ్చింది లేదు.. నాగార్జున సాగర్‌ నీటిసామర్థ్యం 319 టీఎంసీలకు గాను, ప్రస్తుతం కేవలం 122 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది.. సాగర్ లో 590 అడుగులకు గాను ,504 అడుగుల నీటి మట్టం పడిపోయింది.. దీనిని అధికారులు డెడ్‌ స్టోరేజ్‌గా పరిగణిస్తారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగు నీటికి అత్యవసర పరిస్థితులు వస్తే, 490 అడుగుల నీటిమట్టంలోనూ రైట్ కెనాల్ కు నీరు వదిలే అవకాశం ఉంది.. కృష్ణా రివర్ బోర్డు జోక్యం చేసుకుంటే తప్ప కిందకి నీరు వదల్లేమని అధికారులు చెబుతున్నారు.. మరోవైపు.. కర్ణాటక , మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జున సాగర్ కు నీటి వనరులు వచ్చే అవకాశం లేదని, సాగునీటి విడుదలకు అవకాశాలు లేవంటున్నారు అధికారులు.. ఎగువ ప్రాంతం నుండి చుక్క నీరు రాకపోవడంతో నాగార్జున సాగర్‌ వెలవెలబోతోంది. దీంతో, సాగర్ పరివాహ ప్రాంతంలో నీటి కటకట తప్పడంలేదు.

Read Also: OG : ఫ్యాన్స్ ను తెగ ఊరిస్తున్న ‘ఓజి’ ఫస్ట్ సింగిల్..?