Site icon NTV Telugu

Viral Video: ఏంటి సామి కొద్దిగా కూడా భయంలేదు.. నాగుపాము కుబుసం ఎలా తీస్తున్నాడో చూడండి..!

Snake Viral

Snake Viral

పాములు ఎంత ప్రమాదకరమో అందరికి తెలిసిన విషయమే.. సాధారణంగా పాములను చూస్తే భయపడే వారు చాలామంది ఉంటారు. ఎందుకంటే అవి కాటు వేయడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది కనుక.. వాటికి దూరంగా ఉంటారు. మరికొందరైతే పాములతో విన్యాసాలు చేస్తారు. మరీ ముఖ్యంగా ఈరోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమని ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి పాముకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో నాగుపామును చేతిలో ఉంచుకుని దాని చర్మాన్ని తీసేస్తున్నాడు. ఈ వీడియోను చూస్తే మనకు గూస్ బంప్స్ రావడం ఖాయం..

Read Also: Pakistan: పాకిస్థాన్‌లో ఈ సారి న్యూఇయర్ వేడుకలు లేవు.. ఎందుకో తెలుసా?

వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి చేతిలో ఒక నాగుపాముని పట్టుకున్నాడు. పాముపై ఉండే చర్మం (కుబుసం)ను నెమ్మదిగా తొలగిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. పాము నెమ్మదిగా క్రిందికి వెళ్తున్నప్పుడు.. అది వ్యక్తి చేతిలో నుంచి కుబుసాన్ని వదిలివేస్తుంది. ఈ సమయంలో పాము తన నాలుకను బయటకు తీసి బుసలు కొట్టడం మనం చూడొచ్చు. ఒకవేళ పాముకు కోపమొచ్చి కాటు వేసిందా.. అంతే సంగతులు.

Read Also: Kavya Thapar: చీరలో హాట్ అందాలతో హీటేక్కిస్తున్న కావ్య.. చూపులతో చంపేస్తున్న ఫోటోలు..

అసలు విషయమేంటంటే.. ఆ వ్యక్తి పాము చర్మాన్ని తీసేస్తున్న విధానాన్ని చూస్తే.. ఎంతో కాలంగా ఈ పని చేస్తున్నాడని, ఈ పాము అతడి పెంపుడు పాము అని అర్థమవుతుంది. అతనికి పాము చర్మాన్ని తొలగించడం సాధారణ ప్రక్రియ.. మానవ శరీరం నుండి డెడ్ స్కిన్ ఎలా వస్తుందో, అదే విధంగా పాము కూడా కొత్త చర్మం కనిపించినప్పుడు పాత చర్మం తొలగిపోతుంది. చివరలో అంతా కుబుసం తీయడం అయిపోయాక.. పాము నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఇంతటి భయంకరమైన ఫీట్ సాధించిన వ్యక్తి పేరు ఫ్లోరిడాకు చెందిన మైక్ హోల్‌స్టన్‌.. ఇతను జూ కీపర్‌గా పనిచేస్తున్నాడు. ఈ షాకింగ్ వీడియో instaలో therealtarzann అనే ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోని చూసిన ప్రజలు దీనిపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

Exit mobile version