NTV Telugu Site icon

Amritpal Singh: లోక్‌సభ ఎన్నికల్లో అమృతపాల్ సింగ్ పోటీపై కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..!

Amt

Amt

ఖలిస్థాన్ అనుకూల నేత, వారిస్ పంజాబ్ దే అధినేత అమృతపాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఇటీవల ఆయన న్యాయవాది ప్రకటించారు. తాజాగా దీనిపై కుటుంబ సభ్యులు కూడా క్లారిటీ ఇచ్చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద ప్రస్తుతం అస్సాం జైల్లో ఉన్న అమృతపాల్ సింగ్‌ను ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై చర్చించారు. అనంతరం కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల్లో పోటీ చేయాలని అమృతపాల్ సింగ్‌పై ఒత్తిడి ఉందని ఆయన తల్లి బల్వీందర్ కౌర్ తెలిపారు. దీంతో అమృతపాల్ సింగ్ రాజకీయాల్లోకి రాబోతున్నారని చెప్పారు. ఖాదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా ఆమె వెల్లడించారు. ఏ పార్టీ నుంచి పోటీ చేయట్లేదని పేర్కొన్నారు. ఇండిపెండెంట్‌గానే బరిలోకి దిగుతున్నట్లు ఆమె వివరించారు. అమృతపాల్‌ సింగ్‌కు పంజాబ్‌ సమస్యలు బాగా తెలుసు అని తల్లి కితాబు ఇచ్చింది.

Cle

అమృత‌పాల్ సింగ్‌.. ఖ‌లీస్తాన్ మ‌ద్ద‌తుదారు. 1984లో జ‌రిగిన ఆప‌రేష‌న్ బ్లూ స్టార్‌ను న‌డిపిన జ‌ర్నేల్ సింగ్ బింద్ర‌న్‌వాలా అంద‌రికీ తెలిసిందే. బింద్ర‌న్‌వాలా ఇండియ‌న్ ఆర్మీ ఆప‌రేష‌న్‌లో హ‌తుడ‌య్యాడు. అయితే అత‌ని స్ట‌యిల్‌లో అమృత‌పాల్ బోధ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. సిక్కుల‌ను త‌న బోధ‌న‌ల‌తో రెచ్చ‌గొడుతుంటారు. ఖ‌లిస్తానీ గ్రూపు వారిస్ పంజాబ్ దేకు చీఫ్‌గా అమృత్‌పాల్ సింగ్ ఉన్నారు. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి రోడ్డు ప్ర‌మాదంలో సింగ‌ర్ దీపూ సింగ్ మృతిచెందారు. వారిస్ పంజాబ్‌ దేను దీపూనే స్థాపించారు. అయితే దీపూ మ‌ర‌ణం త‌ర్వాత ఆ గ్రూపును అమృత్‌పాల్ న‌డిపిస్తున్నారు. ప్ర‌భుత్వ‌మే దీపూను చంపిన‌ట్లు అమృత్‌పాల్ ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Akhilesh Yadav : బీజేపీ భయపడుతోంది.. రెండో దశ ఓటింగ్ తర్వాత అఖిలేష్ కీలక వ్యాఖ్యలు

బింద్ర‌న్‌వాలా త‌ర‌హాలో అమృత్‌పాల్ సింగ్ డ్రెస్ చేసుకుంటారు. ట‌ర్బ‌న్ కూడా క‌ట్టుకుంటారు. సాంప్ర‌దాయ సిక్కు గుర్తుల్ని ఆయ‌న క్యారీ చేస్తుంటారు. త‌న దగ్గర ఉన్న భారీ ఆయుధ ద‌ళం ఫౌజువాన్‌తో ఇటీవ‌ల గోల్డెన్ టెంపుల్‌ను కూడా విజిట్ చేశారు. సామాజిక రుగ్మ‌త‌లు, డ్ర‌గ్స్‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తామ‌ని చెప్పి బింద్ర‌న్‌వాలా స్ట‌యిల్‌లోనే జ‌నాల్ని ఆక‌ర్షిస్తున్నారు. స‌ప‌రేటు సిక్కు దేశం కావాల‌ని పోరాడుతున్నారు. బింద్ర‌న్‌వాలా ఎలా పోరాడాడో.. అదే అడుగుజాడ‌ల్లో అమృత్‌పాల్ న‌డుస్తున్నాడు.

ఖలిస్తానీ ఉద్య‌మాన్ని అణిచివేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా అమృత్‌పాల్ బెదిరించారు. ఇందిరా గాంధీ త‌ర‌హాలోనే చంపేస్తామ‌ని హెచ్చరించారు. పాకిస్థాన్ ఐఎస్ఐతో అమృత్‌పాల్ సింగ్‌కు ఏదైనా లింకు ఉందా అన్న కోణంలో విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Crime: భార్య, తన తమ్ముడిని పెళ్లి చేసుకుందనే కోపంతో పసిపాప హత్య..