Site icon NTV Telugu

Andhra Mahila Sabha Hospital: ఆసుపత్రిలో దారుణం.. పేషెంట్ పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నం

Hospital

Hospital

హైదరాబాద్ విద్యానగర్ లోని ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో దారుణం వెలుగుచూసింది. ఓ వార్డ్ బాయ్ మహిళా పేషెంట్ పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ట్రీట్ మెంట్ కోసం వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు వార్డ్ బాయ్. అసభ్య ప్రవర్తనతో మహిళ పేషంట్ కేకలు వేసింది. మహిళా పేషంట్ అరుపులతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. అక్కడే ఉన్న బాధితురాలి కుటుంబ సభ్యులు వార్డ్ బాయ్ ని చితకబాదారు. అనంతరం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించిన వార్డుబాయ్ ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Exit mobile version