NTV Telugu Site icon

MLC ByElection: నేడు నల్గొండ- వరంగల్- ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్

Mlc Counting

Mlc Counting

MLC ByElection: ఇవాళ ఉదయం 8 గంటలకు నల్గొండ- వరంగల్- ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ గోడౌన్ లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం పోలైన ఓట్లు 3 లక్షల, 36వేల, 13 కాగా.. ఈ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థుల ఉన్నారు. కౌంటింగ్ కోసం 4 హాల్స్ లలో 96 టేబుల్స్ ను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

Read Also: Benefits with Kalbandha: అందానికే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలకు కూడా కలబంద..

ఇక, నేటి మధ్యాహ్నం తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అలాగే, రాత్రి 11 గంటలకు వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పోలై.. చెల్లిన ఓట్లలో సగం కంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థిని విజేతగా ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. గెలవడానికి కావాల్సిన కోటా ఓట్లు వచ్చేంత వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.