NTV Telugu Site icon

Road Accident: కొత్తకోటలో చెట్టును ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి!

Road Accident

Road Accident

5 Dead in Kothakota Road Accident: వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తకోట బైపాస్ టేక్కలయ్య దర్గా సమీపంలో 44వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. హాస్పిటల్ కు తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను వనపర్తి ఏరియా ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బళ్లారి నుంచి హైదరాబాదుకు వెళుతున్న ఎర్టిగా కారు అదుపుతప్పి చెట్టుకు ఢీ కొట్టింది. కారులో మొత్తం పదకొండు మంది ప్రయాణిస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని కొత్తకోట ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show comments