Site icon NTV Telugu

Wamiqa Gabbi: తగ్గేదేలే.. ప్లాప్ హీరోయిన్ ఖాతాలో ఆరు సినిమాలు

Wamiqa Gabbi Cover

Wamiqa Gabbi Cover

అదేంటి ప్లాప్ హీరోయిన్ ఖాతాలో అన్ని ప్రాజెక్టులా..? రష్మికను తలదన్నే లైనప్ ఆమె సొంతమా ? అంటే అవుననే సమాధానం చెప్పాలి. పదేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీకి సిద్దమౌతున్న, ఐదు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తున్న ఆమె గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సైడ్ రోల్స్ నుండి హీరోయిన్‌గా ఛేంజైన వామికా గబ్బీ, ఇప్పుడు వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్. స్టార్ హీరోయిన్ ని మించిపోయిన లైనప్ ఆమె సొంతం. లాస్ట్ ఇయర్ ఎండింగ్‌లో వచ్చిన బేబీ జాన్ బాక్సాఫీస్ బాంబ్ గా మారినప్పటికీ.. వామికా ఆఫర్లకు కొదవలేదు. స్టార్ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మికను మించిపోయేలా ఆఫర్లను కొల్లగొడుతుంది ఆమె.

Ram Charan: సంక్రాంతి అయింది.. ఈసారి దసరా మీద కన్నేసిన చెర్రీ

అదీ కూడా నాట్ ఓన్లీ వన్ ఇండస్ట్రీ.. ఏకంగా ఫైవ్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. జబ్ వి మెట్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన పంజాబీ భామ పంజాబీతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని తెచ్చుకుంది. 2015లో వచ్చిన భలే మంచి రోజుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. దాదాపు 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీకి సిద్ధమైంది. అడివి శేష్ హిట్ మూవీ గూఢచారి సీక్వెల్లో కన్ఫర్మ్ అయ్యింది. రీసెంట్గా ఆమె ఎంట్రీని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పుడు వామికా గబ్బీ చేతిలో ఆరు ప్రాజెక్టులున్నాయి. కిక్లీ పంజాబీ మూవీతో పాటు జీని, ఇరవాకలం తమిళ్ మూవీస్, తెలుగులో గూఢచారీ 2, దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ బాలీవుడ్ ప్రొడక్ట్, మలయాళ మూవీ టికీ టాకాలో యాక్ట్ చేస్తుంది. ఇలా ఐదు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తుంది బ్యూటీ. మరీ ఈ సారైనా టాలీవుడ్ లో హిట్ కొట్టి ఇక్కడ కూడా పాగా వేస్తుందేమో చూడాలి మరి.

Exit mobile version