NTV Telugu Site icon

Vyjayanthi Movies: వైజయంతి మూవీస్ కి…అతనికి సంబంధం లేదు!

Vyjayanthi Movies

Vyjayanthi Movies

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ సంస్థ కీలక ప్రకటన చేసింది. రెండు మూడు రోజుల క్రితం ఒక వ్యక్తి వైజయంతి మూవీస్ బ్యానర్లో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేస్తున్నాడని అతన్ని బెట్టింగ్ వ్యవహారంలో అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయం మీద వైజయంతి మూవీ సంస్థ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.. ఆన్లైన్ గేమ్ కారణంగా ఎస్సార్ నగర్ పోలీసులు నీలేష్ చోప్రా అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. అయితే సదరు వ్యక్తి వైజయంతి మూవీస్ సంస్థతో ఎప్పుడూ పనిచేయలేదని, తమకు అవగాహన ఉన్నంతవరకు అతనికి సంస్థకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది.

READ MORE: Mastan Sai: మస్తాన్ సాయి కేసులో కొత్త ట్విస్ట్..డ్రగ్స్ తో పరార్?

ఈ విషయాలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకు వెళ్ళామని మీడియా కూడా దయచేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేసేముందు క్రాస్ చెక్ చేసుకోవాలని కోరింది. వైజయంతి మూవీస్ సంస్థ చాలా కాలం పాటు సినీ నిర్మాణానికి దూరంగా ఉంది. కానీ గత ఏడాది ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడి సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడమే కాక కోట్లాది రూపాయల కలెక్షన్లు కురిపించింది. ఇక ప్రస్తుతానికి శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ఛాంపియన్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాను వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.