Karnataka Elections 2023: 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ కి అంతా రెడీ అయ్యింది. దాదాపుగా 38 రోజుల పాటు హోరాహోరీగా ప్రచారం జరిగింది. ఎలక్షన్స్ సాఫీగా సాగేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసింది ఈసీ. రేపు అనగా బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ణాటకలో పోలింగ్ జరుగుతుంది. 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సాగుతుంది. 2 వేల 615మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 5 కోట్ల 31 లక్షలమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 30 వేల పోలీస్ స్టేషన్స్‌లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ స్టేషన్లు కనెక్ట్ చేశారు.
58 వేల 545 పోలింగ్ బూతులు రాష్టవ్య్రాప్తంగా ఏర్పాటు చేశారు. ఒక్క బెంగళూరులోనే 8 వేల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 84 వేల 119 మంది పోలీసులను ఎలక్షన్ విధుల్లో తీసుకుంది ఎన్నికల కమిషన్.. 2 వేల 959 మంది స్పెషల్ ఆఫీసర్స్ ని వినియోగిస్తున్నారు. 8వ తేదీన 5 గంటల నుంచి లిక్కర్ అమ్మకాలపై నిషేధం మొదలైంది.. మే 14 ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుందని ఈసీ తెలిపింది. చునావనా మొబైల్ అప్లికేషన్ ద్వారా పోలింగ్ స్టేషన్లు గుర్తించేలా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ బూత్ లొకేషన్.. అక్కడికి వెళ్లేందుకు దారి చూపే విధంగా నావిగేషన్ సెటప్ చేశారు. ఎలక్షన్ లో పోటీ చేసే క్యాండేట్ల పేరు…పోలింగ్ బూత్ ఆఫీసర్ పేరు.. ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలో వంటి విషయాలు చునావనా అప్లికేషన్ లో పొందుపరిచారు.
మరోవైపు, కర్ణాటక ఎలక్షన్స్ పై వర్ష ప్రభావం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 9 , 10 , 11 తేదీల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. దీనికి తగినట్టుగా ఏర్పాట్లు చేశామన్నారు కర్ణాటక ఎలక్షన్ కమిషనర్ మీనా. ఎలక్షన్స్ జరిగే రోజున అనగా. మే 10న మెట్రో రైలు సేవల సమయాన్ని మరింతగా పొడిగించింది బెంగళూరు మెట్రో రైల్. మే 13వ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న విషయం విదితమే..
ఇక, ప్రధాన పార్టీలకు దడపుట్టిస్తున్నారు 918 మంది స్వతంత్ర అభ్యర్థులు.. అసెంబ్లీకి మొత్తం 2,613 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించారు.. మొత్తం ఓటర్ల సంఖ్య 5 కోట్ల 21 లక్షలు ఓటర్లు ఉండగా.. అందులో మహిళా ఓటర్లు 2 కోట్ల 59 లక్షలు.. పురుష ఓటర్లు 2 కోట్ల 62 లక్షలుగా ఉంది.. మొదటిసారి ఓటువేసేవారి సంఖ్య 9 లక్షల 17 వేలుగా ఉంది. గిరిజన వర్గాలు, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలు 58 వేల 282గా ఉండగా.. 84,119 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నారు..
