Site icon NTV Telugu

Vodafone Idea: అత్యంత ఖరీదైన రూ.4999 ప్రీపెయిడ్ ప్లాన్ విడుదల చేసిన వొడాఫోన్ ఐడియా.. ప్రయోజనాలేంటంటే..?!

Vi

Vi

Vodafone Idea: భారతదేశంలో మూడవ అతిపెద్ద టెలికాం సంస్థగా వొడాఫోన్ ఐడియా (Vi) కొనసాగుతుంది. అయితే తాజాగా దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ ధర రూ.4999. ఇది ఫ్యామిలీ ప్లాన్ కూడా కాదు. కేవలం ఒక్క వినియోగదారుని కోసం మాత్రమే. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఇంత భారీ ధర ఉన్నా కూడా రోజుకు కేవలం 2GB డేటా మాత్రమే అందుతోంది. అయితే, ఈ ప్లాన్ ఖరీదు ఎక్కువగా ఉండటానికి కారణం అదనంగా లభించే ఎంటర్టైన్‌మెంట్ ప్రయోజనాలే ముఖ్య కారణం. వొడాఫోన్ 5G సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఈ ప్లాన్‌కు 5G డేటా కూడా లభ్యమవుతుంది.

Read Also: Cuauhtemoc: బ్రిడ్జ్‌ను ఢీకొన్న నేవీ ట్రైనింగ్ షిప్.. ఇద్దరు మృతి, 19 మంది గాయాలు..!

రూ.4999 ప్లాన్‌లో లభించే ప్రయోజనాల విషయానికి వస్తే.. ఈ ప్లాన్‌లో 365 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS, రోజుకు 2GB డేటా లభిస్తుంది. అదనంగా Vi MTV (మూవీస్ అండ్ టీవీ) సబ్‌స్క్రిప్షన్, అమెజాన్ ప్రైమ్ లైట్ వార్షిక సబ్‌స్క్రిప్షన్, Vi హీరో అన్ లిమిటెడ్ ప్రయోజనాలు ఉన్నాయి.

Read Also: Vijayanagaram: తల్లి తన ప్రేమ వివాహానికి అడ్డుగా ఉందని.. ప్రియుడితో కలిసి కూతురు దారుణం!

ఇక Vi హీరో అన్ లిమిటెడ్ ప్రయోజనాలను చూస్తే.. ఇందులో వీకెండ్ డేటా రోల్‌ ఓవర్, డేటా డిలైట్స్, హాఫ్ డే అన్‌లిమిటెడ్ డేటా (రాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు)ఉంటాయి. హాఫ్ డే అన్‌లిమిటెడ్ డేటా అంటే రోజు 2GB డేటా మాత్రమే అయినా, అర్థరాత్రి నుంచి మధ్యాహ్నం వరకు అపరిమిత డేటా అందుబాటులో ఉంటుంది. కాబట్టి, డేటా తక్కువవుతున్న అనుభూతి లేకుండా ఉంటుంది. ఇక Vi MTV సబ్‌స్క్రిప్షన్ ద్వారా వినియోగదారులు ZEE5, SonyLIV, Playflix, Fancode, Aaj Tak, Manoramamax సహా మొత్తం 16 OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందుతారు.

ఈ ప్లాన్ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌తో పాటు మంచి ఎంటర్టైన్‌మెంట్‌ ప్రయోజనాలను కోరుకునే, అధిక బడ్జెట్ ఉన్న వినియోగదారులకు మాత్రమే సరిపోయే అవకాశం ఉంది. సాధారణ వినియోగదారులకు ఈ ప్లాన్ అత్యంత ఖరీదైనదిగా అనిపించే అవకాశం ఉంది. Vi ఇంకా మరిన్ని వార్షిక ప్లాన్‌లను కూడా అందిస్తోంది.

Exit mobile version