రష్యా దేశాధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రష్యా దేశాధ్యక్షుడిగా మంగళవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయిదోసారి అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు. మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లోని సెయింట్ ఆండ్రూస్ హాల్‌లో ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాణస్వీకారానికి యూఎస్ సహా పలు దేశాలు దూరంగా ఉన్నాయి.
71 ఏళ్ల పుతిన్ ప్రత్యేక కారులో క్రెమ్లిన్ ప్యాలెస్‌కు వెళ్లారు. రాజ్యాంగానికి చెందిన ఒక ప్రత్యేక కాపీపై ఓ చేయి వేసి దేశానికి సేవ చేయనున్నట్లు ప్రమాణ స్వీకారం చేశారు. 2020లో జరిగిన సవరణలతో కూడిన రాజ్యాంగ పుస్తకాన్ని ప్రమాణ స్వీకారం వేళ వినియోగించారు. జాతీయ పార్లమెంట్‌కు చెందిన చట్టసభ ప్రతినిధులు, న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. చీఫ్ జస్టిస్ వలెరి జోర్కిన్ .. పుతిన్ అయిదోసారి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ద్రువీకరించారు. దీంతో ఆయన మరో ఆరేళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా పుతిన్ కొనసాగనున్నారు. 2000, 2004, 2012, 2018 సంవత్సరాల్లో పుతిన్ ప్రమాణం చేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పుతిన్ 87.28 శాతం ఓట్లతో భారీ విజయం సాధించారు. 1999 నుంచి ప్రెసిడెంట్‌గా ప్రధానమంత్రిగా పుతిన్ అధికారంలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Israel-Hamas War: రఫాలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్ దళాలు.. హమాస్ చివరి కోటను బద్ధలు కొట్టడమే లక్ష్యం..
ఇక గత రెండేళ్లుగా ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం సాగిస్తున్నారు. భారీ స్థాయిలో సైనికులను దించి యుద్ధం చేయిస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌ను నేలమట్టం చేశారు. అణు ప్రయోగానికి కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన దేశాలపై కూడా పుతిన్ గుర్రుగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Prajwal Revanna S*x Scandal: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోలను స్టోర్ చేసుకోవద్దు.. ప్రజలకు సిట్ హెచ్చరిక..