NTV Telugu Site icon

Vizag Lady Viral Photos: విశాఖలో యువతి వీరంగం.. వైరల్ అవుతున్న ఫోటోలు

Lady4

Lady4

విశాఖలో బాగా మందేసి, చిందేసిన యువతి ఉదంతం హాట్ టాపిక్ అవుతోంది. ఆ యువతి పోలీసుల్ని బండ బూతులు తిట్టడం, డ్యూటీలో వున్న ఓ పోలీస్ అధికారిపై దాడి చేయడం కలకలం రేపుతోంది.

గంజాయి మద్యం మత్తులో దుర్భాషలాడి త్రీ టౌన్ ఏఎస్ఐ పై దాడికి పాల్పడింది. పైగా కాలుతో తన్నిన యువతి ఉదంతం కలకలం రేపింది. నా బాయ్ ఫ్రెండ్ కి చెప్పి మిమ్మల్ని లేపించేస్తానంది అమూల్య. రేపటి నుంచి పోలీసులు ఎవరు రోడ్డుమీద తిరగకుండా చేస్తానని మైకంలో సవాల్ విసిరింది అమూల్య. ఆర్కే బీచ్ వైఎంసీఏ వద్ద బహిరంగంగా బండి మీద కూర్చొని బీరు తాగుతుండగా పోలీసులు చూశారు. నైట్ రౌండ్స్ లో ఉన్న ఏఎస్ఐ ఆమెను చూసి వెళ్లి ప్రశ్నించగా బీర్ బాటిల్ తో పోలీస్ పై దాడి చేసింది. త్రీ టౌన్ ASI పై దాడి చేస్తుండగా అక్కడ ఉన్న యువకుడు మధ్యలో అడ్డురావడంతో అతని కన్నుపై బీరు బాటిల్ తగిలి గాయం అయింది.

 

పోలీస్ అధికారితో యువతి వాగ్వాదం 

తాగిన మైకంలో ఆమె మాట్లాడిన మాటలు రాయడానికి, మాట్లాడానికి కూడా వీలులేని విధంగా వున్నాయి. బాగా చదువుకున్న యువతి ఇలా మాట్లాడుతుందని ఎవరూ ఊహించరు. పోలీసుల దాడి ఘటనపై అధికారులు సీరియస్ అవుతున్నారు.