Vizag Murder: విశాఖలో దారుణం.. ప్రియురాలిని ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో పెట్టిన నేవీ ఉద్యోగి!
- విశాఖపట్నం నగరంలోని గాజువాకలో దారుణం
- ప్రియురాలిని ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
- భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాలు ఇంటికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని గాజువాక ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఒక యువతిని హత్య చేసిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గాజువాక 70వ వార్డు పరిధిలోని ఎల్బీ నగర్లో ఈ ఘటన జరిగింది. ఈ హత్యతో గాజువాక ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి.. నేవీ ఉద్యోగి అయిన ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం… శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన నేవీ ఉద్యోగి రవీందర్ తన ప్రియురాలిని ఇంటికి పిలిపించి దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. కొంత భాగాన్ని ఫ్రిజ్‌లో, మరో భాగాన్ని గోనె సంచిలో దాచాడు. ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన అనంతరం నిందితుడు స్వయంగా గాజువాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రవీందర్ ఇంటికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు.
Also Read
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
Also Read: CM Chandrababu: నాయుడుపేటలో సీఎం చంద్రబాబు పర్యటన.. పుదూరులో టిడ్కో గృహాల ప్రారంభం!
ఈ దారుణానికి కారణంగా కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత వివాదాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు రవీందర్ భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాలిని ఇంటికి పిలిపించుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతురాలి వివరాలు, హత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!